విక్టరీ వెంకటేష్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో వస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సంక్రాతికి వస్తున్నాం’. వచ్చే ఏడాది సంక్రాతి పండుగ టార్గెట్‌గా బరిలోకి దిగుతోంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మాణ సారథ్యంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి కావస్తోంది. ఇప్పటికే దాదాపు 90% షూటింగ్ పార్ట్ పూర్తయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
త్వరలోనే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది. ఈ గ్రిప్పింగ్ ట్రయాంగిల్ క్రైమ్ డ్రామాలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్‌గా హీరోయిన్ మీనాక్షి చౌదరి కనిపించనుంది. తాజాగా టీమ్ డబ్బింగ్ కార్యక్రమాలను కూడా ప్రారంభించింది. ఈ నేపథ్యంలో సంక్రాతికి వస్తున్నాం సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది.
కాగా ఈ పాటను పాపులర్ మ్యూజిక్ కంపోజర్ రమణ గోగుల పాడనుండటం విశేషం. ఈ మేరకు మేకర్స్ నేడు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే 18 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత, వెంకీ సినిమాలో రమణ గోగుల భాగమవనుండటం గమనార్హం. ఇంతకుముందు 2006లో వెంకటేష్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘లక్ష్మి’ చిత్రానికి రమణ గోగులే సంగీతం అందించారు.
ఇక ఈ క్రేజీ ఎంటర్‌టైనర్‌కు భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తుండగా.. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, తమ్మిరాజు ఎడిటర్. అలాగే ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లేను ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ అందించగా, వి వెంకట్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు.
కాగా వెంకీ, అనిల్, దిల్ రాజు కాంబినేషన్‌లో ఇంతకుముందు వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 బ్లాక్ బాస్టర్ అయ్యాయి. ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ కాంబోలో ‘సంక్రాంతికి వస్తున్నాం’తో హ్యాట్రిక్ మూవీగా రాబోతోంది. దీంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: