ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘జనక అయితే గనక’. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో సంగీర్తన హీరోయిన్‌గా నటించగా.. వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
చిత్రం విడుదలకు ముందే రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, టీజర్‌లు అన్నీ ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ నేపథ్యంలో జనక అయితే గనక దసరా సందర్భంగా అక్టోబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కోర్ట్ రూమ్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకుంది. సెన్సిబుల్ స్టోరీకి సుహాస్ నటన తోడవడంతో ఈ సినిమా ఆడియెన్స్‌ను అలరించింది.
దీంతో ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌పై మూవీ లవర్స్ అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా జనక అయితే గనక ఓటీటీ లోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ఈరోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. కానీ ఈ అవకాశం ఆహా గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న యూజర్లకు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంది.
అయితే మిగిలిన యూజర్లకు సాధారణ యాక్సెస్‌తో రేపటి నుంచి పూర్తిస్థాయిలో చూసే అవకాశం కల్పించనుంది. ఈ మేరకు సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. సో.. మూవీ లవర్స్ గెట్ రెడీ.. థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయినవారు మరియు ఇంకోక్కసారి ఈ సినిమాను వీక్షించాలనుకునేవారు త్వరలోనే ఎంచక్కా ఇంట్లో కూర్చునే దీనిని చూసేయడానికి సిద్ధంగా ఉండండి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























