దసరా తరువాత నాచురల్ స్టార్ నాని- డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో మరో సినిమా రానుందని తెలిసిందే.రీసెంట్ గానే లాంచ్ కూడా అయ్యింది.దసరాకి మించిన యాక్షన్ తో ఈసినిమా తెరకెక్కనుంది. జనవరి నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.ఇక ఈసినిమా టైటిల్ ఇంట్రెస్టింగ్ గా వుంది.ది ప్యారడైజ్ అనే టైటిల్ పెట్టారు.మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ ను తీసుకోవాలనుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది దసరా.దాంతో ఇదే కాంబినేషన్ లో వస్తున్న ది ప్యారడైజ్ పై అంచనాలు భారీగా వున్నాయి.దసరాను నిర్మించిన నిర్మాత చెరుకూరి సుధాకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.ఇక రీసెంట్ సరిపోదా శనివారంతో హ్యాట్రిక్ బ్లాక్ బాస్టర్ కొట్టి నాని పీక్ ఫామ్ లో వున్నాడు.
ఈసినిమా తరువాత నాని ప్రస్తుతం హిట్ 3 చేస్తున్నాడు.సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుండి ఈసినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం రాజస్థాన్ లో ఓ షెడ్యూల్ జరుగుతుంది.డిసెంబర్ చివరి కల్లా షూటింగ్ కంప్లీట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తుండగా శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.ప్రశాంతి తిపిర్నేని,నాని ఈసినిమాను నిర్మిస్తున్నారు.వచ్చే ఏడాది మే 1న హిట్ 3ని థియేటర్లలోకి తీసుకురానున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























