టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. జనవరి 10న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ఈ మూవీ ప్రమోషనల్ కార్యక్రమాలను సరికొత్తగా నిర్వహిస్తున్నారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనిలో భాగంగా ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఈనెల 9న టీజర్ లాంచ్ ఈవెంట్ జరుపనున్నారు. అనంతరం అమెరికాలో, ఆ తర్వాత చెన్నైలో, ఆపై రెండు తెలుగు రాష్ట్రాలలో.. ఇలా మూవీ రిలీజ్ వరకు వరుసపెట్టి స్పెషల్ ఈవెంట్స్ ఏర్పాటుచేస్తున్నారు. తద్వారా గేమ్ ఛేంజర్‌ను భారీ సక్సెస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇకఇదిలావుంటే, ప్రొడ్యూసర్ దిల్ రాజు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి పూనుకున్నారు. రెండు దశాబ్దాలకు పైగా ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలను ఇండస్ట్రీకి అందించిన ఆయన ఇప్పుడు తన బ్రాండ్‌ను తమిళనాట కూడా పరిచయం చేయబోతున్నారు. దీనిలో భాగంగా తాను నిర్మిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాను తమిళంలో పెద్ద ఎత్తున రిలీజ్ చేయడానికి నిశ్చయించుకున్నారు.
ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఆదిత్య రామ్ మూవీస్ అధినేత అయిన ఆదిత్య రామ్‌తో దిల్ రాజు చేతులుకలిపారు. ఆదిత్య రామ్ మూవీస్ సహకారంతో గేమ్ ఛేంజర్ సినిమాను కోలీవుడ్‌లో గ్రాండ్‌గా విడుదలచేయనున్నారు. అక్కడి స్టార్ హీరోల చిత్రాల రేంజ్‌లో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తద్వారా కోలీవుడ్‌లో తన తొలి అడుగును ఘనంగా వేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ ఇద్దరి సహకారం కేవలం గేమ్ ఛేంజర్ తోనే కాకుండా భవిష్యత్తులోనూ కొనసాగుతుందని వారు తెలిపారు. ఈ మేరకు తాజాగా గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్‌లో భాగంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ప్రొడ్యూసర్ దిల్ రాజు తమ ఫ్యూచర్ ప్లాన్స్‌ను వివరించారు.
కాగా ఆదిత్య రామ్ మూవీస్ ఇంతకుముందు తెలుగులో ‘ఏక్ నిరంజన్, స్వాగతం, సందడే సందడి, ఖుషీ ఖుషీగా’ అనే సూపర్ హిట్ చిత్రాలను నిర్మించింది. ఈ క్రమంలో ఈ సంస్థతో కలిసి నిర్మాత దిల్ రాజు కోలీవుడ్‌లో డిస్ట్రిబ్యూషన్ చేయబోతుండటం సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. అటు ప్రేక్షకుల్లోనే కాకుండా, ఇటు ఇండస్ట్రీలోనూ ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది.
కేవలం భారీ బడ్జెట్ చిత్రాలే కాకుండా, కంటెంట్ ప్రధానంగా చిన్న సినిమాలను సైతం నిర్మించడం దిల్ రాజు ప్రత్యేకత. ‘దిల్, ఆర్య, బొమ్మరిల్లు’తో మొదలుకుని ఇటీవలి ‘బలగం’ వరకూ ఎన్నో అద్భుతమైన సినిమాలను మనకు అందించారు ఆయన. ఈ నేపథ్యంలో.. మన సినిమాల స్థాయిని పెంచిన స్టార్ ప్రొడ్యూసర్ ఈ కొత్త బిజినెస్ లోనూ సక్సెస్ అవ్వాలని తెలుగు ఫిల్మ్ నగర్ తరపున కోరుకుంటూ, దిల్ రాజు గారికి ఆల్ ది బెస్ట్ చెబుదాం..
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























