గేమ్ ఛేంజర్ తరువాత గ్లోబల్ స్టార్ స్టార్ రామ్ చరణ్ తన 16వ సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సనాతో చేయనున్నాడని తెలిసిందే.ఈసినిమాలో చరణ్ మాస్ లుక్ లో కనిపించనున్నాడు.ఈసినిమాకోసం బరువు కూడా పెరుగుతున్నాడు.ఇక ఈనెల 22న ఈసినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మైసూర్ లో మొదటి షెడ్యూల్ స్టార్ట్ కానుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దాదాపు 15 రోజులపాటు ఈ షెడ్యూల్ జరుగనుందట.ఈ షెడ్యూల్ లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనుండగా కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్ర చేయనున్నాడు.ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ,వృద్ధి సినిమాస్ , సుకుమార్ రైటింగ్స్ ఈసినిమాను నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో విడుదలచేయనున్నారు.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.
ఇక గేమ్ ఛేంజర్ విషయానికి వస్తే ఈనెల 9న టీజర్ ను వదలనున్నారు.షూటింగ్ కూడా ఆల్మోస్ట్ పూర్తయినట్లే.డిసెంబర్ నుండి నాన్ స్టాప్ ప్రమోషన్స్ చేయనున్నారు.శంకర్ ఈసినిమాను తెరకెక్కిస్తుండగా కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.అంజలి, శ్రీకాంత్, ఎస్ జె సూర్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్నాడు.వచ్చే ఏడాది జనవరి 10న గేమ్ ఛేంజర్ థియేటర్లలోకి రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























