మచ్ అవైటెడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్.ఈనెల 9న ఈ టీజర్ ను విడుదలచేయనున్నామని పోస్టర్ ద్వారా తెలియజేశారు.ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ సినిమాపై బజ్ ను మరింతగా పెంచేసింది.ఇంతకుముందు వరకు క్లాస్ పోస్టర్లను విడుదలచేయగా నిన్న మాస్ పోస్టర్ ను వదిలారు.అందులో రైల్వే ట్రాక్ మీద నలుగురు రౌడీలను పడుకోబెట్టి అక్కడే చరణ్ కూర్చొని కనిపించాడు.చరణ్ లుంగీ లుక్ కూడా ఆకట్టుకుంది.ఇక ఈ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో హైలైట్ అవ్వనుందట.ఈ ఎపిసోడ్ కోసం భారీ గా ఖర్చు చేశారని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టీజర్ ను కూడా అంచనాలను అందుకొనే విధంగా కట్ చేశారని టాక్. తెలుగు తోపాటు తమిళ ,హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.ఇక ఈనెల లో షూటింగ్ ను పూర్తి చేసుకోనుంది.డిసెంబర్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి జనవరి 10న విడుదలచేయనున్నారు.ప్రమోషన్స్ కూడా భారీ లెవెల్లో చేయనున్నారు.హిట్ టాక్ వస్తే గేమ్ ఛేంజర్ 500 కోట్ల మార్క్ ను క్రాస్ చేయనుంది.
టాప్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్న ఈసినిమాలో కియరా అద్వానీ హీరోయిన్ నటించగా ఎస్ జె సూర్య,శ్రీకాంత్, శ్యామ్,అంజలి కీలక పాత్రల్లో పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమా విజయం శంకర్ కు కీలకం కానుంది.ఈఏడాది శంకర్ డైరెక్షన్ లో వచ్చిన భారతీయుడు 2 నిరాశపరిచింది.దాంతో ఈ డైరెక్టర్ గేమ్ ఛేంజర్ తో కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: