మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా లక్కీ భాస్కర్ ఎక్స్ లెంట్ రన్ ను కొనసాగిస్తోంది.నిన్నటితో ఈసినిమా కోట్ల 50 క్లబ్ లో చేరింది.లక్కీ భాస్కర్ ప్రపంచ వ్యాప్తంగా 4రోజుల్లో 55.4 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని మేకర్స్ ప్రకటించింది.ఈరోజు తో బ్రేక్ ఈవెన్ కూడా పూర్తి కానుంది.తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కేరళ ,తమిళనాడులో కూడా లక్కీ భాస్కర్ సత్తాచాటుతుంది.ఫుల్ రన్ లో 100కోట్ల మార్క్ ను టచ్ చేయనుంది.అటు నార్త్ అమెరికా లో 700k డాలర్ మార్క్ ను క్రాస్ చేసింది.రేపటి తో 1మిలియన్ ను చేరుకోనుంది.ఈకూడా బుకింగ్స్ బాగానే వున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దుల్కర్ ఈసినిమాతో తెలుగులోవరుసగా సెకండ్ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు.అంతేకాదు లక్కీ భాస్కర్ తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలువనుంది. వెంకీ అట్లూరి ఈసినిమాను డైరెక్ట్ చేయగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్, శ్రీకర స్టూడియోస్ ఈసినిమా ను నిర్మించాయి.
ఇక ఈసినిమా తరువాత దుల్కర్ తెలుగులో ఆకాశంలో ఒక తార అనే సినిమా చేస్తున్నాడు.పవన్ సాధినేని ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా సందీప్ గుణ్ణం ,రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు.దింతో పాటు దుల్కర్ కాంత అనే పాన్ ఇండియా మూవీ కూడా చేస్తున్నాడు.ఇందులో మిస్టర్ద బచ్చన్గ్ ఫేమ్ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది.దుల్కర్ తో కలిసి దగ్గుబాటి రానా ఈసినిమా నిర్మిస్తున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























