హనుమాన్ సంక్రాంతికి చిన్న సినిమాగా వచ్చి 300కోట్లకు పైగా వసూళ్లను సాధించి మీడియా బడ్జెట్ సినిమాల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది .కేవలం 20కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈసినిమా ఊహించని లాభాలను తీసుకొచ్చింది.అంతేకాదు స్టార్ హీరోలకు సైతం అందని ద్రాక్షలా వున్న రికార్డులను క్రీయేట్ చేస్తూ సెన్సేషన్ సృష్టిస్తుంది.అలాగే హిందీ లోకూడా ఈసినిమా సాలిడ్ వసూళ్లను రాబట్టింది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ఈసినిమాలో తేజ సజ్జా హీరోగా నటించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాకు సీక్వెల్ కూడా రానుందని తెలిసిందే.జై హనుమాన్ టైటిల్ తో తెరకెక్కనుంది.సీక్వెల్ ప్రకటించినప్పటి నుండే సినిమాఫై అంచనాలు మొదలయ్యాయి. ఇక ఈరోజు ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.ఇందులో జై హనుమాన్ గా జాతీయ అవార్డు గ్రహీత కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి నటిస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా అదిరిపోయింది. రాముడి విగ్రహం పట్టుకొని హనుమాన్ గెటప్ లో వున్న రిషబ్ శెట్టి లుక్ ఆకట్టుకుంది.
భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మిస్తుంది.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో వున్న ఈసినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.త్వరలోనే ఈసినిమా గురించి మరిన్ని అప్డేట్ లు రానున్నాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























