హీరోగా అన్న కొడుకు ఎంట్రీ.. వెల్‌కమ్ చెప్పిన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

NTR and Kalyan Ram Welcomes Nandamuri Taraka Ramarao Entry in Tollywood

దివంగత లెజెండరీ నటుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత జానకీరామ్ తనయుడైన యంగ్ చాప్ నందమూరి తారక రామారావు ఫిలిమ్స్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు డైనమిక్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి రచన, దర్శకత్వం వహిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ కోసం వైవిఎస్ చౌదరి ‘న్యూ టాలెంట్ రోర్స్ @’ అనే కొత్త బ్యానర్ ప్రకటించడం విశేషం. వైవీఎస్ చౌదరి సతీమణి యలమంచిలి గీత నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా బుధవారం నందమూరి తారక రామారావు ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు వైవిఎస్ చౌదరి పరిచయం చేశారు. కథానాయికగా తెలుగమ్మాయి వీణ రావ్ నటించనుంది.

ఈ నేపథ్యంలో స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ స్పందించారు. నందమూరి తారక రామారావు టాలీవుడ్ ఎంట్రీని స్వాగతించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా గ్రాండ్ వెల్‌కమ్ చెబుతూ స్పెషల్ పోస్టులు పెట్టారు. కాగా నందమూరి తారక రామారావు.. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌ల సోదరుడు, దివంగత జానకీరామ్ కుమారుడే అన్న విషయం తెలిసిందే.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.