తెలుగు చిత్రసీమలో విశిష్ట ఘనత కలిగిన ‘నందమూరి’ వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళుతూ, దివంగత లెజెండరీ నటుడు శ్రీ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత శ్రీ జానకిరామ్ తనయుడైన యంగ్ చాప్ నందమూరి తారక రామారావు ఫిలిమ్స్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. కాగా ఈ సినిమాకు డైనమిక్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి రచన, దర్శకత్వం వహిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ కోసం వైవిఎస్ చౌదరి కొత్త బ్యానర్ ప్రకటించడం విశేషం. ఇప్పటికే ఆయన ‘బొమ్మరిల్లు వారి” అనే నిర్మాణ సంస్థను స్థాపించి ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించారు. వీటిలో.. లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు, ఒక్క మగాడు, సలీమ్, నిప్పు, రేయ్ వంటి సినిమాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ‘న్యూ టాలెంట్ రోర్స్ @’ అనే బ్యానర్‌ను స్థాపించారు.
ఈ బ్యానర్‌లో తొలి సినిమాగా యంగ్ నందమూరి తారక రామారావుతో మూవీ చేస్తున్నారు. చౌదరి సతీమణి యలమంచిలి గీత నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా బుధవారం ఈ ప్రాజెక్ట్‌లో హీరోగా నటిస్తోన్న నందమూరి తారక రామారావు ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు వైవిఎస్ చౌదరి పరిచయం చేశారు.
ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తుండగా.. మరో ఆస్కార్ విన్నింగ్ లిరిక్ రైటర్ చంద్రబోస్ ఈ సినిమాకి సాహిత్యం అందిస్తున్నారు. స్టార్ డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. ఇక ఈ సినిమాలో కథానాయికగా తెలుగమ్మాయి వీణ రావ్ నటించనుంది.
అయితే ఇటీవలే నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ హీరోగా ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ స్టార్ హీరోలుగా రాణిస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో అదే ఫ్యామిలీ నుండి ఇప్పుడు మరో వారసుడు ఎంట్రీ ఇస్తుండటం ఆసక్తికరంగా మారింది. దీంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























