కల్కిలో అమితాబ్‍ని చూసినప్పుడు నాకు అనిపించింది ఇదే

ఏఎన్నార్‌ జాతీయ అవార్డు ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పద్మ విభూషణ్, మెగాస్టార్ చిరంజీవికి బిగ్ బి అమితాబ్‌ బచ్చన్‌ చేతులమీదుగా ఏఎన్నార్ అవార్డును ప్రదానం చేశారు. అతిరథ మహారథులు హాజరైన ఈ వేడుక కన్నుల సాగింది. కాగా ఈ అవార్డు వేడుకలో ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణిని ప్రత్యేకంగా సన్మానించారు. ఈ నేపథ్యంలో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ వేడుకలో పాల్గొన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా కింగ్ అక్కినేని నాగార్జున తన తండ్రిని స్మరించుకుని కొంత భావోద్వేగానికి లోనయ్యారు. నాగార్జున ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం.. “అందరికి నమస్కారం. ఏయన్నార్‌ ఈ మూడు అక్షరాలే నాకు ప్రపంచం. నాకే కాదు మా కుటుంబం, స్నేహితులు, అభిమానులు అందరికీ. మా నాన్న గారు హ్యుమానిటీని నమ్మారు. మనుషుల్ని నమ్మారు. అన్నిటికంటే ముఖ్యంగా సినిమాని బిలీవ్ చేశారు.”

“అభిమానులు, ప్రేక్షకులు మనసులో చిరస్థాయిగా ఒక లెజెండ్ గా నిలిచారు. భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిల్చే అలాంటి గొప్ప వ్యక్తులని గౌరవించడం ఏయన్నార్‌ అవార్డు ముఖ్య ఉద్దేశం. ఈరోజు అలాంటి గొప్ప వ్యక్తులు ఇద్దరు, ఇండియన్ సినిమా ఏ బి సి.. అమితాబచ్చన్ జి, మెగాస్టార్ చిరంజీవి గారిని ఆహ్వానిస్తున్నాను. ఈ ఏడాది నా డియర్ ఫ్రెండ్, పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి అవార్డు ఇవ్వడం ఎంతో ప్రత్యేకం.”

“ఈ అవార్డుని నేను ఎంతగానో ఆరాధించే పద్మ విభూషణ్ అమితాబచ్చన్ గారు ప్రజెంట్ చేయడం ఇంకా స్పెషల్. కొన్నేళ్ల క్రితం అమితాబచ్చన్ గారు ఏఎన్నార్ అవార్డుని అందుకోవడం లు అవార్డు ప్రతిష్టని మరింతగా పెంచింది. ఈరోజు చిరంజీవి గారికి అవార్డు ప్రధానం చేయడానికి అమితాబచ్చన్ గారు రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఏఎన్ఆర్ శతజయంతి సందర్భంగా ఇది మాకు ఎంతో ప్రత్యేకం.”

“రీసెంట్ గా కల్కి సినిమా చూశాను. అమితాబచ్చన్ గారిని అశ్వద్ధామ చూసినప్పుడు మా ఒరిజినల్ మాస్ హీరో ఈజ్ బ్యాక్ అనిపించింది. ఇదే విషయం ఆయనకి కాల్ చేసి చెప్పాను. ఆయన ఎంతో ఆనందంగా నవ్వారు. అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అమితాబచ్చన్ గారి స్క్రీన్ ప్రజెంట్, మేనరిజం, ఇంపాక్ట్ సింప్లీ అండ్ అన్ టచబుల్. అమితాబ్ బచ్చన్ గారు ఎన్నో సామాజిక కార్యక్రమాలకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్నారు. హ్యాట్సాఫ్ అమితాబచ్చన్ గారు.”

“మై డియర్ ఫ్రెండ్ చిరంజీవి గారితో నాకు ఎన్నో బ్యూటిఫుల్ మెమోరీస్ ఉన్నాయి. ఆయన సినిమాలు గురించి మీ అందరికీ తెలుసు ఆయన బ్రేక్ చేసిన రికార్డులు అంతా ఇంతా కాదు. ఈమధ్య గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో కూడా ఎక్కారు. నేను సినిమాల్లోకి వద్దాం అనుకున్నప్పుడు.. నాన్నగారు ఒకసారి అన్నపూర్ణ స్టూడియోస్ లో చిరంజీవి గారి షూటింగ్ జరుగుతుంటే ఆయన డాన్స్ ని చూడమని నాకు చెప్పారు. అప్పుడు రెయిన్ సాంగ్ జరుగుతుంది. చిరంజీవి గారి డాన్స్, గ్రేస్ చూసి నాకు కొంచెం గుబులు పుట్టింది. ఆయనలాగా డాన్స్ చేయగలనా అనిపించింది.”

“చిరంజీవి గారి స్పెక్టాక్యులర్ సినిమా జర్నీ మనందరికీ తెలుసు. అలాగే ఆయన వెలకట్టలేని సామాజిక సేవ కార్యక్రమాలు ఎన్నో చేశారు. చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ ఎంతోమంది ప్రాణాలను కాపాడింది. కోవిడ్ టైంలో ఫిలిం వర్కర్స్ అందరికీ ఒక దారి చూపించారు. నాన్నగారు ఎప్పుడు ఒక మాట చెప్తుండేవారు. మనం సొసైటీ నుంచి ఏదైనా తీసుకున్నప్పుడు మళ్లీ తిరిగి ఇవ్వాల్సి బాధ్యత మన మీద ఉంటుందని. చిరంజీవి గారు, అమితాబచ్చన్ గారు అదే చేసి చూపించారు.”

“అమితాబ్ బచ్చన్ గారు చిరంజీవి గారిని కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా అని పిలిచారు. అది ముమ్మాటికి నిజం. ఇలాంటి ఈ వేదికపై ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది అమితాబ్ బచ్చన్ గారు ఏఎన్ఆర్ అవార్డుని చిరంజీవి గారికి ప్రజెంట్ చేయడం మా అందరికీ ఎంతో సంతోషం. కీరవాణి గారు మా ఫాదర్ జర్నీని వారి మ్యూజిక్ తో చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. థాంక్యూ కీరవాణి గారు. థాంక్యూ ఆల్. ఏఎన్ఆర్ లీవ్స్ ఆన్” అని అన్నారు హీరో నాగార్జున.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.