నేను ఎప్పుడు ఏది అడిగినా చిరు సిద్ధంగా ఉంటారు – అమితాబ్

Amitabh Bachchan Praises Megastar Chiranjeevi at ANR National Awards Event

ఏఎన్నార్‌ జాతీయ అవార్డు ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పద్మ విభూషణ్, మెగాస్టార్ చిరంజీవికి బిగ్ బి అమితాబ్‌ బచ్చన్‌ చేతులమీదుగా ఏఎన్నార్ అవార్డును ప్రదానం చేశారు. అతిరథ మహారథులు హాజరైన ఈ వేడుక కన్నుల సాగింది. కాగా ఈ అవార్డు వేడుకలో ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణిని ప్రత్యేకంగా సన్మానించారు. ఈ నేపథ్యంలో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ వేడుకలో పాల్గొన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా బిగ్ బి అంతా బచ్చన్ గారు మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. అక్కినేని నాగేశ్వరరావు ఫౌండేషన్, నాగార్జున, అక్కినేని ఫ్యామిలీ అందరికీ నా కృతజ్ఞతలు. ఇండియన్ సినిమాకి నాగేశ్వరరావు గారు చేసిన సేవలు అనితర సాధ్యం. ఇండియన్ సినిమాకి నాగేశ్వరరావు గారి కాంట్రిబ్యూషన్ ని ఎవరు మ్యాచ్ చేయలేరు. నాగేశ్వరరావు గారి లెగిసిని కంటిన్యూ చేస్తున్న నాగార్జునకి నా అభినందనలు. ఐ యాం వెరీ గ్రేట్ ఫుల్ టు యు నాగ్” అని అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. మై డియర్ ఫ్రెండ్ చిరంజీవి గారికి ఈ అవార్డును నేను ప్రదానం చేయడం నాకు చాలా గౌరవంగా ఉంది. నేను ఎప్పుడు ఏది అడిగినా ఆయన సిద్ధంగా ఉంటారు. థాంక్యూ చిరంజీవి గారు. నేను చిరంజీవి గారి సినిమాలో నటించాను. చిరంజీవి గారి ఫ్రెండ్షిప్ కి థాంక్యూ సో మచ్. చిరంజీవి గారి ప్రేమ అభిమానం ఆప్యాయతకి ధన్యవాదాలు” అని పేర్కొన్నారు.

ఇక చివరిగా అమితాబ్ తెలుగు చిత్ర పరిశ్రమపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. “నేను కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పార్ట్ అని చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంది. చిరు సినిమాతోపాటు నాగ్ అశ్విన్ మూవీలో కూడా నటించాను. అందుకే ఇకపై నన్ను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మెంబర్‌గా తీసుకోవాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ నాగ్ అశ్విన్ నెక్స్ట్ టైం తన ఫిలిమ్ లో మళ్ళీ నన్ను తీసుకోవాలని కోరుతున్నాను (నవ్వుతూ). అందరికీ థాంక్యూ సో మచ్” అని చెప్పారు బిగ్ బి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.