అప్పుడు అదే ఎమోషన్‌తో ఏడవాల్సి వచ్చింది

Actress Tanvi Ram Shares Her Experience of Working For The Film KA

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌’క’ సినిమాను రూపొందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమా ఈ నెల 31న దీపా‌వళి పండుగ సందర్భంగా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ‘క’ సినిమాను తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి, మలయాళంలో హీరో దుల్కర్ సల్మాన్ తన వేఫర్ ఫిలింస్‌పై రిలీజ్ చేయబోతున్నారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో ‘క’ సినిమా హైలైట్స్‌తో పాటు ఈ చిత్రంలో నటించిన ఎక్స్‌పీరియన్స్ తెలిపారు హీరోయిన్ తన్వీ రామ్.

  • నేను తెలుగులో నాని హీరోగా నటించిన అంటే సుందరానికీ సినిమాలో నటించాను. ఆ సినిమా కథలో ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో కనిపించాను.
  • ఒక సినిమా సెలెక్ట్ చేసుకునే ముందు నా క్యారెక్టర్ కథలో ఎంత కీలకంగా ఉందనేది చూసుకుంటాను. హీరోయిన్ గానే కనిపించాలని అనుకోవడం లేదు.
  • క సినిమాలో రాధ అనే క్యారెక్టర్ చేశాను. డైరెక్టర్ సందీప్ నాకు ఫోన్ లో కొంత నెరేషన్ ఇచ్చారు.
  • నేను పూర్తిగా వినాలని చెబితే కంప్లీట్ స్క్రిప్ట్ నా క్యారెక్టర్ తో సహా చెప్పారు. రాధ క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ అనేది తెలిసింది. వెంటనే ఒప్పుకున్నాను.
  • రాధ ఒక స్కూల్ టీచర్. అభినయ వాసుదేవ్, సత్యభామ ఒక టైమ్ ఫ్రేమ్ లో కనిపిస్తే, నేను మరో పీరియడ్ లో కనిపిస్తా.
  • నా పాత్రకు వారి పాత్రలకు మధ్య కనెక్షన్ ఏంటనేది స్క్రీన్ మీదే చూడాలి. సత్యభామ పాత్రతో నాకు సీన్స్ ఉండవు.
  • క సినిమా రిలీజ్ అయ్యాక నేను ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడాలి అనుకుంటున్నా. ఇప్పుడే చెబితే థ్రిల్ రివీల్ అవుతుంది.
  • నేను క సినిమా కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు కిరణ్ గారు వేరే ప్లేస్ కు వెళ్తున్నారు. నేను వస్తున్నానని తెలిసి కలిసి మాట్లాడారు.
  • కో ఆర్టిస్టులను కిరణ్ గారు బాగా గౌరవిస్తారు. ఆయన ఈ సినిమా కోసం చూపించిన డెడికేషన్ అద్భుతమనే చెప్పాలి.
  • ప్రతి విషయంలో ఆయన జాగ్రత్తలు తీసుకున్నారు. మాకు ఎంతో సపోర్ట్ చేశారు. కిరణ్ గారు ఇచ్చిన ఎంకరేజ్ మెంట్ తో టీమ్ అంతా బాగా పనిచేశారు.
  • ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉంది. కృష్ణగిరి అనే ఊరు కూడా ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. ప్రతి క్యారెక్టర్ లో ట్విస్ట్ లు టర్న్స్ ఉంటాయి.
  • క్లైమాక్స్ మాత్రం మరో స్థాయిలో ఉంటుంది. మా అందరినీ కథకు బాగా కనెక్ట్ చేసింది పతాక సన్నివేశాలే.
  • మొత్తం సినిమా సమ్మరీ చెప్పాలంటే క టైటిల్ లోనే ఉంది. కథలోని ఎన్నో ఎమోషన్స్ మా క్యారెక్టర్ ద్వారా రిఫ్లెక్ట్ అవుతాయి.
  • మా సినిమాకు అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువే అయ్యింది. అయితే మా ప్రొడ్యూసర్ గారు ఎంతో ఎంకరేజ్ చేస్తూ టీమ్ కు తన సపోర్ట్ అందించారు.
  • నేను చేసిన రాధ క్యారెక్టర్ ఎక్కువ నైట్ షూట్స్ చేశారు. నేను ఎర్లీగా నిద్రపోతుంటా.
  • నైట్ షూట్ కాబట్టి మెలకువగా ఉండాల్సివచ్చింది. ఇది ఛాలెంజింగ్ గా అనిపించింది.
  • అలాగే నేను సరదాగా నవ్వుతూ ఉంటాను. రాధ క్యారెక్టర్ కొన్నిసార్లు ఏడవాల్సి ఉంటుంది.
  • ఆ లాంగ్ సీక్వెన్స్ సీన్స్ అనేకసార్లు, వివిధ యాంగిల్స్ లో షూట్ చేశారు. అప్పుడు మళ్లీ మళ్లీ అదే ఎమోషన్ తో ఏడవాల్సి వచ్చింది.
  • ఇలా నా పర్సనల్ లైఫ్ క్యారెక్టర్ కు భిన్నంగా సెట్ లో ఉండటం వ్యక్తిగతంగా నాపై ప్రభావం చూపించింది.
  • అయితే నటిగా నేను ఇవన్నీ వృత్తిలో భాగంగా తీసుకోవాల్సిందే.
  • క సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యాక మంచి రెస్పాన్స్ వచ్చింది. నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంతా మూవీ చూసేందుకు వెయిట్ చేస్తున్నారు.
  • క సినిమా సెకండ్ పార్ట్ కు లీడ్ ఉంటుంది. కానీ సీక్వెల్ గురించి తర్వాత చెబుతాం.
  • ప్రస్తుతం తమిళం, మలయాళంలో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తున్నా.
  • క రిలీజ్ తర్వాత తెలుగులోనూ మంచి ఆఫర్స్ వస్తాయని ఆశిస్తున్నా.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.