పొట్టేల్‌కి ప్రతి థియేటర్‌లో స్టాండింగ్ ఒవేషన్ వస్తోంది

Pottel Movie Receiving Standing Ovation in Every Theatre

యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేసిన రెవల్యూషనరీ బ్లాక్ బస్టర్ ‘పొట్టేల్’. ఈ చిత్రంలో అజయ్ పవర్ ఫుల్ రోల్ లో అదరగొట్టారు. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే ఈ చిత్రాన్ని నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని, విమర్శకులు ప్రశంసలు అందుకొని ఘన విజయాన్ని సాధించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా టీం సక్సెస్ మీట్ ని నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్ లో డైరెక్టర్ సాహిత్ మోత్ఖూరి ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పారు.

ఈ సందర్భంగా సాహిత్ మోత్ఖూరి మాట్లాడుతూ.. “సినిమాకి 80 శాతం రివ్యూలు పాజిటివ్ గా వచ్చాయి. ఈ మధ్య కాలంలో ఇంత పాజిటివ్ ఏ సినిమాకి రాలేదు. అందరూ హానెస్ట్ సినిమా అని చెబుతున్నారు. యువ, అనన్య, అజయ్, నోయల్ అందరి పెర్ఫార్మెన్స్ లకు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రతి థియేటర్ లో సినిమాకి స్టాండింగ్ ఒవేషన్ వస్తోంది. ఇంత గొప్పగా రెస్పాన్స్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్ యూ.” అని అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “అజయ్ అన్న కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారనే కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. నిర్మాతలు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను, యువ ని అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. అనన్య పెర్ఫామెన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ థాంక్. ఈ సినిమా చేసినందుకు చాలా ప్రౌడ్ గా ఫీలౌతున్నాను. అందరూ థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను” అని కోరారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.