ద్వాదశ జ్యోతిర్లింగాల సందర్శనలో కన్నప్ప టీమ్

Kannappa Team Kick off 12 Jyotirlingas Visit From Kedarnath, Badrinath and Rishikesh

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో విష్ణు మంచు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’. విష్ణు కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కన్నప్ప టీమ్ ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శన చేపట్టింది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగాగల ద్వాదశ (12) జ్యోతిర్లింగాలను దర్శించుకోనుంది. దైవిక ఆశీర్వాదం కోసం ఈ పవిత్ర యాత్రను చేపట్టింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ క్రమంలో హీరో విష్ణు మంచు, ఆయన తండ్రి, సీనియర్ నటుడు మోహన్ బాబు, చిత్ర దర్శకుడు ముఖేష్ కుమార్, నటుడు అర్పిత్ రంకాతో కలిసి కేదార్‌నాథ్, బద్రీనాథ్ రిషికేశ్‌లో ఆధ్యాత్మిక తీర్థయాత్రకు బయలుదేరారు. పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్‌నాథ్‌ను కన్నప్ప టీం సందర్శించింది. ఆపై బద్రీనాథ్‌లో ప్రార్థనలు కూడా చేశారు. రిషికేశ్ సందర్శనతో వారి ప్రయాణం ముగిసింది.

ఈ సందర్భంగా హీరో విష్ణు మంచు మాట్లాడుతూ.. “కేదార్‌నాథ్, బద్రీనాథ్, రిషికేష్‌కు రావడం ఆనందంగా ఉంది. పరమ శివుడి పరమ భక్తుడి కథగా కన్నప్ప చిత్రం విడుదలకు ముందే మొత్తం 12 జ్యోతిర్లింగాలను సందర్శించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. మా ఎపిక్ యాక్షన్ చిత్రం విడుదల కోసం మేము ఎదురుచూస్తున్నాము” అని అన్నారు. కాగా విష్ణు మంచు ఈ చిత్రాన్ని.. భక్తి, శౌర్యం, ఆధ్యాత్మిక అన్వేషణతో కూడిన ప్రయాణంగా అభివర్ణించారు.

విష్ణు మంచు కన్నప్ప ఫస్ట్ లుక్, టీజర్ అభిమానులలో ఉత్సాహాన్ని నింపిన సంగతి తెలిసిందే. ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ వంటి ఇతిహాసాల స్ఫూర్తితో, ప్రముఖ హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ చే న్యూజిలాండ్‌లోని సుందరమైన ప్రకృతి దృశ్యాలలో చిత్రీకరించబడిన ఈ చిత్రం విజువల్ వండర్‌గా రాబోతోంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్‌, శరత్ కుమార్ సహా భారీ తారాగణం ఉంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.