కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీవిష్ణు, ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘స్వాగ్’. ఇంతకుముందు వీరి కాంబోలో వచ్చిన ‘రాజరాజ చోర’ సినిమా మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో దీనిపై మంచి అంచనాలేర్పడ్డాయి. దీనికితోడు విడుదలకు ముందు ఈ చిత్రం నుంచి రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రీతూ వర్మ హీరోయిన్‌గా నటించగా.. మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ క్రమంలో స్వాగ్ అక్టోబర్ 4న థియేటర్లలోకి వచ్చింది. అయితే మూవీకి పాజిటివ్ రెప్సాన్స్ వచ్చినప్పటికీ స్టోరీలోని కాన్‌ప్లిక్ట్ అందరికీ కనెక్ట్ కాలేకపోయింది. వివేక్ సాగర్ సంగీతం అందించిన ఈ సినిమాలో శ్రీవిష్ణు నాలుగైదు పాత్రల్లో కనిపించడంతో ఆడియెన్స్ కనప్యూజ్ అయ్యారు.
ఈ నేపథ్యంలో స్వాగ్ చిత్రం కేవలం 20 రోజుల్లోనే ఓటీటీ లోకి వచ్చేసింది. ఎలాంటి హడావిడి లేకుండా నేడు సడన్‌గా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రస్తుతం ఇది ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్సయిన వారు డిఫరెంట్ స్టోరీ చూడాలనుకుంటే ఈ సినిమా మంచి ఆప్షన్.
స్వాగ్ కథ ఏంటంటే..?
కథానాయకుడైన భవభూతి (శ్రీవిష్ణు) పోలీస్ డిపార్టుమెంటులో ఎస్సైగా పనిచేసి రిటైర్ అవుతాడు. అయితే, రిటైర్మెంట్ తర్వాత అతనికి రావాల్సిన బెనిఫిట్స్ అందకుండా ధనలక్ష్మి అనే ఓ మహిళా అధికారి అడ్డుకుంటుంది. దీంతో తీవ్ర నిరాశకు లోనైన భవభూతి, అనుకోకుండా ఒక రహస్యం తెలుసుకుంటాడు. తాను శ్వాగణిక వంశానికి చెందివాడినని, పూర్వీకులనుంచి వారసత్వంగా తనకు కోట్ల రూపాయల ఆస్తి వచ్చే అవకాశం ఉందని తెలుసుకుంటాడు.
అయితే శ్వాగణిక వంశ వారసులు ఈ సంపదను కైవసం చేసుకోవాలంటే వారు తమ వారసత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో భవభూతి ఆ ఆస్తిని దక్కించుకోవడం కోసం వంశవృక్ష నిలయానికి వెళతాడు. అతనికి అక్కడ అనుభూతి (రీతూ వర్మ) తారసపడింది. భవభూతి వారసత్వం నిరూపించుకోవడానికి అవసరమైన శ్వాగణిక వంశ పారంపర్య రాగి పలక ఒకటి ఆమె దగ్గర ఉంటుంది.
దానిని దక్కించుకోవడానికి భవభూతి ప్రయత్నం చేస్తుంటాడు. ఈ క్రమంలో తనలాగే ఉండే సింగరేణి అలియాస్ సింగ (శ్రీవిష్ణు)ని చూస్తాడు. అయితే ఒకే రూపురేఖలతో ఉన్న భవభూతి, సింగ మధ్య సంబంధం ఏమిటి? వాళ్లిద్దరికి ఆస్తి రాకుండా చేసిన యయాతి (శ్రీ విష్ణు) ఎవరు? అసలు శ్వాగణిక వంశ పారంపర్య పలక అనుభూతి దగ్గరకి ఎలా వచ్చింది?
1551 ఏళ్ల క్రితం మగవాళ్లని బానిసల్లా చూసిన వింజామర వంశ మహారాణి రుక్మిణీ దేవి (రీతూ వర్మ)కి ఈ కథకూ సంబంధం ఏంటి? ఆమె ఆధిపత్యాన్ని ధిక్కరించి పురుషాధిక్యతను పెంచడానికి శ్వాగణిక వంశ మహారాజు భవభూతి (శ్రీ విష్ణు) ఏం చేశాడు? రేవతి (మీరా జాస్మిన్), విభూతి ఎవరు? చివరకు ఆస్తి ఎవరు దక్కించుకున్నారు? అనేది మిగతా కథ.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























