ఉగ్రమ్ ఫేమ్ రోరింగ్ స్టార్ శ్రీమురళి నటించిన బఘీర ఈ దీపావళికి రానుంది.తెలుగులో కూడా విడుదలవుతుంది.ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడం అలాగే ప్రశాంత్ నీల్ కథ అందించడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.డాక్టర్ సూరి ఈసినిమాను డైరెక్ట్ చేయగా ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.టాలీవుడ్ టాప్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది.ఈ సందర్భంగా హీరో శ్రీమురళి విలేకరులు సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బఘీర ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయ్యింది ?
ప్రశాంత్ నీల్ గారు ఫస్ట్ స్టోరీ ఇచ్చారు. నన్ను ఈ స్టొరీ చేయమని చెప్పారు. ఆయన అంటే నాకు చాలా ఇష్టం.నా కెరీర్ లో ఉగ్రం లాంటి ఒక గొప్ప సినిమా ఇచ్చారు.ఉగ్రం సినిమా సమయంలో మేము చాలా క్లోజ్ అయ్యాం.హోంబలే ఫిలింస్ ప్రొడ్యూస్ చేస్తామని ముందుకు వచ్చారు.అలా ఈ ప్రాజెక్టు మొదలైంది.
తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారు ?
మా అత్తగారిది నెల్లూరు.ఇంట్లో వైఫ్, అత్తగారు తెలుగు మాట్లాడుతారు.అలా వచ్చింది.
ఈ క్యారెక్టర్ కోసం మూడేళ్లు జిమ్ ట్రైనింగ్ తీసుకున్నారని విన్నాం ?
అవునండి. క్యారెక్టర్ అలాంటిది.నేను నిజానికి ఫుడ్ లవర్ ని. చికెన్, మటన్, రైస్ అన్ని ఇష్టంగా తింటాను.బిర్యాని అంటే పిచ్చి. కానీ ఈ మూడేళ్లు చాలా కష్టంగా గడిచింది. చాలా స్ట్రిక్ డైట్ చేశాను.లిక్విడ్ డైట్ చేశాను. అది చాలా ఛాలెంజ్.నా కెరీర్లో ఇది వెరీ డేరింగ్,అండ్ ఛాలెంజింగ్ క్యారెక్టర్. క్యారెక్టర్ డిమాండ్ ప్రకారం చాలా డెడికేటెడ్ గా వర్క్ చేశాను.ఈ మూడేళ్లలో నాలో చాలా మార్పులు వచ్చాయి.
డైరెక్టర్ డాక్టర్ సూరి గురించి ?
ప్రశాంత్ నీల్ గారు స్టోరీ ఇచ్చారు.డైరెక్టర్ సూరి గారు 100% కథని అద్భుతంగా స్క్రీన్ మీదకు తీసుకొచ్చారు.ఈ స్టోరీని, ఐడియాని అద్భుతంగా ఎనలైజ్ చేశారు. ఈ స్క్రిప్ట్ కి ఏం కావాలో అవన్నీ అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేశారు. ఇది లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్. యూనివర్సల్ అప్పీల్ ఉన్న కంటెంట్.డైరెక్టర్ గారు నా నుండి చాలా మంచి పెర్ఫార్మన్స్ ని రాబట్టుకున్నారు.పర్సనల్ గా ఇది నాకు చాలా ఫేవరెట్ క్యారెక్టర్.సూరి గారి లాంటి బ్రిలియంట్ టెక్నీషియన్ తో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్.
ప్రశాంత్ నీల్ గారి సపోర్టు ఎలా ఉండేది?
నాకు ప్రశాంత్ నీల్ గారి సపోర్టు ఎప్పుడు ఉంటుంది.టీంలో అందరం డిస్కస్ చేసుకునేవాళ్ళు.ప్రశాంత్ నీల్ గారికి గ్రేట్ విజన్ ఉంది.నన్ను ఆయన చూసే పర్స్పెక్టివ్ డిఫరెంట్.ఆయన నన్ను చాలా బలంగా నమ్మారు.
ఈ సినిమా షూటింగ్ లో మీకు గాయాలు అయ్యాయని విన్నాం ?
షూటింగ్ లో అవి కామన్.నిజంగా ఈ సినిమా చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని.అయితే నాకు నా సినిమానే ఇంపార్టెంట్. నేను ఆ గాయాల గురించి పట్టించుకోలేదు.
రుక్మిణి వసంత్, ప్రకాష్ రాజ్ గారి వర్క్ ఎక్స్ పీరియన్స్ గురించి ?
ఫెంటాస్టిక్. నేను ప్రకాష్ రాజు గారికి పెద్ద ఫ్యాన్ ని.ఆయనతో వర్క్ చేయడం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్.ఆయన్నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. రుక్మిణి వసంత్ వెరీ గుడ్ హీరోయిన్.వెరీ సిన్సియర్,వెరీ నేచురల్ యాక్టర్.
మీ నుంచి తెలుగులో వస్తున్న మొదటి సినిమా ఇది, ఈ సినిమానే తీసుకురావడానికి కారణం?
ఇది మా ప్రొడక్షన్ కాల్. చాలా మంచి సినిమా చేశా.దేశమంతా చూడదగ్గ సినిమా ఇది.ఆ నమ్మకంతో ఈ సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నాం. తెలుగు ప్రేక్షకుల నుంచి లవ్, సపోర్ట్ లభిస్తుందని నమ్ముతున్నాను.
అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ గురించి ?
అజనీష్ ది బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. ఆయన డిఫరెంట్ సినిమాలు చేస్తుంటారు.మిగతా సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో చాలా డిఫరెంట్ మ్యూజిక్ ఉంటుంది. ఇందులో లవ్ ట్రాక్,ఎమోషనల్ ట్రాక్స్ ,కథని డ్రైవ్ చేసే మ్యూజిక్ అన్నీ అద్భుతంగా కుదిరాయి. గ్రేట్ అవుట్ ఫుట్ ఇచ్చారు.
ఉగ్రం 2 అనౌన్స్ చేశారు కదా.. అందులో మీ క్యారెక్టర్ గురించి ?
అది నాకు తెలియదండి.మీరు ప్రశాంత్ నీల్ గారిని అడగాలి.ఆయనతో వర్క్ చేయడానికి నేను ఎదురుచూస్తున్నాను.
మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతారా?
కథ బావుండి, కథలో నా క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటే మల్టీ స్టారర్స్ లో పార్ట్ అవడం నాకు ఇష్టమే.
కొత్త ప్రాజెక్ట్స్ గురించి ?
త్వరలోనే చెబుతాను.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























