లక్కీ భాస్కర్ ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్

Lucky Baskhar Trailer gets super response

ఈ దీపావళికి విడుదలవుతున్న సినిమాల్లో లక్కీ భాస్కర్ ఒకటి .సీతారామంతో సాలిడ్ హిట్ కొట్టి ఇక్కడ కూడా ఫాలోయింగ్ తెచ్చుకున్న మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ టైటిల్ రోల్ లో నటించాడు.సార్ తో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి ఈసినిమాను డైరెక్ట్ చేయడం అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ నుండి వస్తున్న సినిమా కావడంతో మొదటి నుండి ఈ సినిమాపై మంచి అంచనాలు వున్నాయి.ఇక నిన్న రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాను మిస్ కావొద్దనే ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈట్రైలర్ ను సూపర్ గా కట్ చేయడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ లో కూడా సినిమా చూడాలనే క్యూరియాసిటీ వచ్చింది. ట్రైలర్ వ్యూస్ పరంగా డీసెంట్ అనిపించినా టాక్ మాత్రం యూనానిమస్ పాజిటివ్ టాక్ వస్తుంది. సినిమాలో విషయం ఉందనే కామెంట్లు వస్తున్నాయి.ఓవరాల్ గా ఒక్క ట్రైలర్ తో సినిమా ఫై అంచనాలు పెంచడంలో టీం సక్సెస్ అయ్యింది.ఇక హిట్ టాక్ వస్తే చాలు 50కోట్ల మార్క్ ను దాటుకోవడం కష్టమేమి కాకపోవచ్చు.

ఈసినిమా తెలుగు తోపాటు పాటు మిగితా భాషల్లో కూడా విడుదలవుతుంది. కంగువా వచ్చే వరకు పెద్ద సినిమాలు ఏవి లేవు అయితే లక్కీ భాస్కర్ విడుదలవుతున్న రోజున అమరన్ , క ,భగీర సినిమాలు కూడా విడుదలవుతున్నాయి.దాంతో లక్కీ భాస్కర్ కు పోటీ తప్పకపోవచ్చు.మరి ఈసినిమ తో దుల్కర్ బ్యాక్ టు బ్యాక్ హిట్ కొడతాడో చూడాలి. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.