యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్‌లో సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘పొట్టేల్’. ఈ చిత్రంలో అజయ్ పవర్‌ఫుల్ రోల్ పోషిస్తున్నారు. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కు స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శేఖర్ చంద్ర అందించిన సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. పొట్టేల్ అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చీఫ్ గెస్ట్‌గా హాజరవగా మూవీ యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది.
ఈ సందర్భంగా హీరో యువ చంద్ర మాట్లాడుతూ.. “సందీప్ అన్న మాకు టైమ్ ఇవ్వడం వెలకట్టలేనిది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తూ.. ఒక్క అవకాశం వస్తే చాలు దేవుడా.. అనుకున్న సమయంలో వచ్చిన అవకాశం పొట్టేల్. డైరెక్టర్ సాహిత్, నిశాంక్, సురేష్ అన్నలకు థాంక్యూ. ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి కావాలి. వీళ్ళిద్దరూ వండర్స్ క్రియేట్ చేస్తారు. ఒక సినిమా ఏ రేంజ్‌లో లవ్ చేస్తారో దగ్గరుండి చూశాను. ఇలాంటి ప్రొడ్యూసర్స్ ముందుకొస్తే మాలాంటి వాళ్ళు ముందుకు వస్తారు” అని అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “నా ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు. చిరంజీవి గారికి ఏకలవ్య శిష్యుడిని. గ్యాంగ్ లీడర్ చూసి డాన్స్ చేయడం స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి మొదలైంది ఇక్కడ వరకు వచ్చింది. ఇక మీ చేతిల్లో వుంది. పొట్టేల్ మూవీ ప్రాపర్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ మూవీ. ఇందులో ఎమోషన్ ఆడియన్స్ మనసుల్ని కదిలించేలా ఉంటుంది. మా సినిమా తప్పకుండా మీ మనసులో ఉంటుంది. మీరు థియేటర్స్ కి వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని నమ్మకం ఉంది” అని చెప్పారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























