యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్‌లో సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘పొట్టేల్’. ఈ చిత్రంలో అజయ్ పవర్‌ఫుల్ రోల్ పోషిస్తున్నారు. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కు స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
శేఖర్ చంద్ర అందించిన సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. పొట్టేల్ అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చీఫ్ గెస్ట్‌గా హాజరవగా మూవీ యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది.
ఈ ఫ్రీ రిలీజ్ ఈవెండ్‌లో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చిత్ర బృందానికి విషెస్ తెలియజేశారు. ఈ సందర్భంగా సందీప్ రెడ్డి ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం.. “పొట్టేల్ కథ విన్నాను. చిన్న కథ చేసుకున్నానని సాహిత్ చెప్పాడు. కథ విన్నాక.. ఇది చిన్న కథ కాదు చాలా పెద్ద కథ అనిపించింది. నేను సినిమా చూశాను. చాలా బాగా నచ్చింది. రెండు పాటలు చాలా బాగా నచ్చాయి. ట్రైలర్ కూడా చాలా బాగుంది.”
“అజయ్ గారు సినిమా అంతా భయపెట్టించి వదిలారు. యువ, అనన్య, నోయల్ జీవ అందరు సూపర్‌గా యాక్టింగ్ చేశారు. సాహిత్ ఇంత అద్భుతంగా తీస్తాడని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సాహిత్ చిన్న కథ అన్నాడు కానీ నాకు చాలా పెద్ద బడ్జెట్ కనిపించింది. ఎలా తీస్తాడు అనుకున్నాను. ప్రొడ్యూసర్స్ చాలా ప్యాషన్‌తో సినిమా తీశారు.”
“సినిమా చాలా బాగుంది. మీ అందరికీ నచ్చుతుంది. న్యూ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్. ఇటీవల యంగ్ డైరెక్టర్లు ఎవరూ ఇలా పూర్తిస్థాయి రూరల్ బ్యాక్ డ్రాప్ సినిమా చేయలేదనుకుంటున్నా. ఆ బ్యాక్‌డ్రాప్‌లో ‘రంగస్థలం’ తర్వాత నేను చూసిన సినిమా ఇదే. అందరికీ ఆల్ ది బెస్ట్. దిస్ ఫిలిం విత్ బిగ్ హార్ట్. అక్టోబర్ 25న ప్లీజ్ కం అండ్ వాచ్. చిన్న సినిమాని అందరూ ఎంకరేజ్ చేయండి. థాంక్యూ” అని అన్నారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: