మట్కా నుండి సలోని ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

MATKA Actress Saloni First Look and Character Reveal Poster Released

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మట్కా’ రిలీజ్‌కు రెడీగా వుంది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు కూడా జోరందుకున్నాయి. ఫస్ట్ సింగిల్ ‘లే లే రాజా’ చార్ట్ బస్టర్ రెస్పాన్స్‌తో మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా మట్కా నవంబర్ 14న సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ మట్కా 25 డేస్ కౌంట్‌డౌన్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. వరుణ్ తేజ్ బ్లాక్ అండ్ బ్లాక్ సూట్‌లో ఇంటెన్స్ అండ్ వింటేజ్ అవతార్‌లో కనిపించిన ఈ పోస్టర్ అదిరిపోయింది. ఇదేక్రమంలో తాజాగా మట్కాలో కీలక పాత్రలో నటిస్తోన్న ప్రముఖ నటి సలోని పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా ఆమె ‘పద్మ’ అనే పాత్రలో కనిపించనున్నట్టు తెలిపింది.

కాగా వరుణ్ తేజ్ కెరీర్‌లో మట్కా మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ మూవీగా తెరకెక్కుతోంది. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్‌గా నటిస్తుండగా.. నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంగీతం జివి ప్రకాష్ కుమార్ అందించగా, ఎ కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.