మాస్ కా దాస్ విశ్వక్ సేన్ అప్ కమింగ్ మూవీ ‘మెకానిక్ రాకీ’ ఫస్ట్ గేర్, సాంగ్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. డెబ్యుటెంట్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. మేకర్స్ ఈ రోజు ‘మెకానిక్ రాకీ’ ట్రైలర్ 1.0 లాంచ్ చేశారు. శ్రీరాములు థియేటర్లో భారీగా హాజరైన అభిమానుల సమక్షంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ట్రైలర్ మెయిన్ క్యారెక్టర్స్ పరిచయం చేస్తూ సినిమా యాక్షన్ ప్యాక్డ్ హ్యామరస్‌గా వుంటుందని ప్రామిస్ చేసింది. రాకీ చదువులో ఫెయిల్ అయిన తర్వాత, తన తండ్రి మెకానిక్ షాప్‌ని టేకోవర్ చేసుకొని, లేడిస్ కోసం డ్రైవింగ్ స్కూల్‌ను ప్రారంభిస్తాడు. హీరోయిన్స్ పాత్రలు పోషించిన మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ లని ఫ్లర్ట్ చేస్తాడు. పవర్ ఫుల్ మ్యాన్ సునీల్‌తో తలపడటం క్యూరియాసిటీని పెంచింది.
ట్రైలర్ లో యాక్షన్, హ్యుమర్, రొమాన్స్, మాస్ అన్నీ ఎలిమెంట్స్ అద్భుతంగా వున్నాయి. డైలాగులు ప్రేక్షకులను అలరించాయి. రవితేజ ముళ్లపూడి తన డైరెక్షన్‌తో ఆకట్టుకున్నాడు. విశ్వక్ సేన్ హ్యుమర్, చరిష్మాతో స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్‌తో కట్టిపడేశాడు. మీనాక్షి చౌదరి క్లాసిక్, ట్రెడిషినల్‌గా పాత్రలో మెరిసింది. శ్రద్ధా శ్రీనాథ్ మోడరన్ అమ్మాయి పాత్రను పోషించింది. నరేష్, వైవా హర్ష కామెడీ రిలీఫ్‌ను అందించగా, సునీల్ మెయిన్ విలన్‌గా చిల్లింగ్ ఇంప్రెషన్‌ని కలిగించాడు.
మనోజ్ కటసాని స్టైలిష్ విజువల్స్, జేక్స్ బెజోయ్ ఎనర్జిటిక్ స్కోర్ ఎక్స్‌పీరియన్స్ మరింతగా ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రానికి అన్వర్ అలీ ఎడిటర్, క్రాంతి ప్రియం ప్రొడక్షన్ డిజైనర్. సత్యం రాజేష్, విద్యాసాగర్ జె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్. ఈ ట్రైలర్ 1.0 రాకీ మాస్ అప్పీల్‌ను ఇంపాక్ట్ ఫుల్‌గా ప్రజెంట్ చేసింది. నవంబర్ 22న విడుదల కానున్న సినిమాపై భారీ అంచనాలు పెంచింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























