కన్నడ రోరింగ్ స్టార్ శ్రీ మురళి హీరోగా తెరకెక్కుతోన్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘బఘీర’. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కథ అందించడం విశేషం. కంప్లీట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి డాక్టర్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ మురళి సరసన ‘సప్తసాగరాలు దాటి’ ఫేమ్ రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది. ఇంకా ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రంగాయణ రఘు, అచ్యుత్ కుమార్, గరుడ రామ్ వంటి పలువురు ప్రముఖ నటులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ అందుకుంది. అక్టోబర్ 31న ఈ చిత్రం థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అవుతోంది. తెలుగులోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా బఘీర ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే, హై యాక్షన్ ప్యాక్డ్ మూవీ అని అర్ధమవుతోంది. శ్రీ మురళి అదరగొట్టేసాడు. మొత్తానికి ట్రైలర్ మూవీపై అంచనాలను పెంచేసేలావుందని చెప్పాలి.
కాగా కన్నడనాట బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘ఉగ్రమ్’ తర్వాత శ్రీమురళి, ప్రశాంత్ నీల్ ఈ సినిమా కోసం మరోసారి చేతులు కలిపారు. అయితే ప్రశాంత్ నీల్ ‘సలార్ పార్ట్ 2’తో బిజీగా ఉండటంతో బఘీరకు దర్శకత్వం వహించలేకపోయాడు, కేవలం కథను మాత్రమే అందించగలిగాడు. దీంతో డాక్టర్ సూరి దర్శకుడిగా తెరపైకొచ్చారు. ప్రతిష్టాత్మక చిత్రాలను నిర్మిస్తోన్న ‘హోంబలే ఫిలిమ్స్’ సంస్థ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో గ్రాండ్‌గా నిర్మిస్తోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























