ట్రైలర్‌లో ఫస్ట్ షాట్ చూసినప్పుడు.. సంయుక్త మీనన్

Samyuktha Menon Interesting Comments About Pottel Trailer

చార్ట్‌బస్టర్ సాంగ్స్, గ్రిప్పింగ్ టీజర్ ప్రామెసింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో ‘పొట్టేల్’ మూవీ స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. అజయ్ ముఖ్య పాత్రలో కనిపిస్తుండగా.. ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞా సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాహిత్ మోత్ఖూరి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా శుక్రవారం స్టార్ హీరోయిన్ సంయుక్త మీనన్ చేతులమీదుగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కాగా అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ట్రైలర్ మరింత అంచనాలను పెంచింది.

ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ సంయుక్త మాట్లాడుతూ.. “అందరికి నమస్కారం. ఐ లవ్ ద ట్రైలర్. మంచి కంటెంట్ ఎవరు చేసినా నాకు చాలా ఇష్టం. డైరెక్టర్ సాహిత్ ఒక స్టోరీ మీద 4 ఇయర్స్ వర్క్ చేయడం మామూలు విషయం కాదు. ఇంత అద్భుతమైన క్వాలిటీలో స్క్రీన్ మీద తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. ఒక మంచి రైటింగ్, డైరెక్షన్ వుంటేనే ఇంత అద్భుతమైన సినిమా తెరపైకి వస్తుంది. ఈ ట్రైలర్‌లో ఫస్ట్ షాట్ చూసినప్పుడు ఒక రియల్ పాన్ ఇండియన్ ఫిల్మ్ అనిపించింది. చాలా అథెంటిక్‌గా ఉంది” అని అన్నారు.

ఇంకా ఆమె మాట్లాడుతూ.. “ఇంత మంచి ఎఫర్ట్‌తో ఈ సినిమాని తీసిన యూనిట్ అందరికీ అభినందనలు. చాలా మంది కొత్త యాక్టర్స్ ఈ సినిమాతో పరిచయం కావడం ఆనందంగా ఉంది. వెల్‌కం టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ. నిర్మాత నిశాంక్ గారు ఈ సినిమా గురించి చెప్పినప్పుడు చాలా ఫ్యాషనెట్ ప్రొడ్యూసర్ అనిపించారు. ఇలాంటి పాషన్ వున్న నిర్మతలు ఫిల్మ్ ఇండస్ట్రీకి కావాలి. యువ, అనన్యకి ఈ సినిమాతో మంచి పేరు రావాలి. అజయ్ గారు అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ఆయన క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్”‘” అన్నారు

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.