చార్ట్‌బస్టర్ సాంగ్స్, గ్రిప్పింగ్ టీజర్ ప్రామెసింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో ‘పొట్టేల్’ మూవీ స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞా సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాహిత్ మోత్ఖూరి దర్శకత్వం వహిస్తున్నారు. యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అజయ్ ముఖ్య పాత్రలో కనిపిస్తుండగా.. ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తాజాగా శుక్రవారం స్టార్ హీరోయిన్ సంయుక్త మీనన్ చేతులమీదుగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
ఈ ట్రైలర్ గమనిస్తే.. తెలంగాణ సరిహద్దు దగ్గర హీరో, అతని కూతురు, టీచర్ వచ్చినప్పుడు అతని కాళ్ళపై పడి తనకు చదువు చెప్పమని వేడుకునే సన్నివేశంతో ట్రైలర్ ప్రారంభమౌతుంది. ఇంతలో బలివ్వడానికి సిద్ధం చేసిన పొట్టేల్ ని ఎవరో దొంగలిస్తారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు, పటేల్ అజయ్ ఆదేశాలతో, హీరో కుటుంబంపై దాడి చేస్తారు. మరోవైపు పటేల్, అమ్మాయిని బలి ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు.
ఇక చివరిలో బాధలో ఉన్న హీరో జలపాతం వద్ద నిలబడిన ప్రాణ త్యాగానికి ప్రయత్నించడంతో ట్రైలర్ ఆసక్తికరంగా ముగిసింది. గ్రామీణ ప్రాంతాల్లో మూఢనమ్మకాలు, హార్ట్ టచ్చింగ్ ఎమోషన్స్, విద్య యొక్క ప్రాముఖ్యత సినిమా యొక్క ప్రధాన కథాంశంగా ట్రైలర్ రివిల్ చేస్తోంది. కాగా అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ట్రైలర్ మరింత అంచనాలను పెంచింది.
దర్శకుడు సాహిత్ మోత్ఖూరి ప్రతి పాత్రను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. యువ చంద్ర కృష్ణ తన కూతురి చదువు కోసం ఆరాటపడే తండ్రిగా కనిపించగా, అనన్య నాగళ్ల తన భార్య క్యారెక్టర్‌లో ఇన్నోసెంట్, నేచురల్ గా కనిపించారు. చైల్డ్ ఆర్టిస్ట్ కూడా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. అజయ్ ఇంటెన్స్ రోల్‌లో అదరగొట్టడంతో పాటు ఫీమేల్ ఎప్పిరియన్స్‌లో సర్‌ప్రైజ్ చేశారు.
ఇక టెక్నికల్ పరంగా చూస్తే.. మోనిష్ భూపతి రాజు కెమెరా పనితనం బ్రిలియంట్‌గా వుంది. శేఖర్ చంద్ర బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ డ్రామాని ఎలివేట్ చేసింది, పెంచల్ దాస్ వాయిస్ ఎమోషన్స్ మరింతగా యాడ్ చేసింది. ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నతంగా వున్నాయి. ఈ మూవీకి కార్తీక శ్రీనివాస్ ఎడిటర్ కాగా, నార్ని శ్రీనివాస్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: