లవ్‌ రెడ్డి ఫ్రీ షోస్‌.. మాట నిలబెట్టుకున్న కిరణ్ అబ్బవరం

Kiran Abbavaram Hosts Free Screenings For Love Reddy Movie

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం మాట నిలబెట్టుకున్నాడు. తాను వాగ్దానం చేసిన మేరకు ‘లవ్‌ రెడ్డి’ సినిమా కోసం 4 స్పెషల్ షోలు ఏర్పాటు చేశాడు. ఇందుకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియా వేదికగా ఈరోజు కిరణ్ అబ్బవరం ప్రకటించాడు. ఫ్రీ షోలు వేస్తున్న థియేటర్స్, షో టైమ్ వంటి వివరాలను వెల్లడించాడు. అందులో .. “ప్రేక్షకులందరూ దయచేసి ఈ సినిమాను వీక్షించి, యువ అరంగేట్ర ఆటగాళ్లందరికీ మీ మద్దతును తెలియజేయండి” అని పేర్కొన్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లవ్‌ రెడ్డి స్పెషల్ స్క్రీనింగ్ జరుగుతోన్న థియేటర్స్ ఇవే..!

  • హైదరాబాద్ – GPR మల్టీప్లెక్స్ రాత్రి 7:45 PM షో (కాంటాక్ట్ నంబర్: 8549955111)
  • వైజాగ్ – శ్రీరామ థియేటర్ సాయంత్రం 6:30 PM షో
  • తిరుపతి – కృష్ణ తేజ థియేటర్ సాయంత్రం 6:30 PM షో
  • విజయవాడ – స్వర్ణ మల్టీప్లెక్స్ సాయంత్రం 6:30 PM షో

అయితే కిరణ్ అబ్బవరం లవ్ రెడ్డి సినిమాను ఎందుకు ఫ్రీ షోలు వేస్తున్నారు అని చాలామందికి సందేహం వస్తోంది. దీనిగురించి తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. వివరాల్లోకి వెళ్తే.. తాజాగా లవ్ రెడ్డి సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు కిరణ్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఈ సినిమాకు తనవంతు సాయంగా కొన్ని షోలు ఉచితంగా ప్రదర్శిస్తానని చిత్ర యూనిట్‌కి ప్రామిస్ చేసాడు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ చిత్రం కోసం స్పెషల్ స్క్రీనింగ్స్ ఏర్పాటుచేశాడు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.