కన్నడ స్టార్ శ్రీమురళి యాక్షన్ ఎంటర్‌టైనర్ బఘీరతో రానున్నాడు.ఈ దీపావళికి కన్నడ తోపాటు తెలుగులోనూ విడుదలకానుంది.ఇక ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ఈరోజు ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు.రుధిర హర అంటూ వచ్చిన ఈసాంగ్ బాగుంది.న్యాయానికి సంబంధించిన ఈ సాంగ్ అనేక రకాల భావోద్వేగాలతో పవర్ ఫుల్ కంపోజిషన్ తో ఆకట్టుకుంది.రాంబాబు గోసాల లిరిక్స్,అనిరుద్ధ శాస్త్రి వోకల్స్ అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాకు ప్రశాంత్ నీల్ కథ అందించాడు.గతంలో శ్రీ మురళి -ప్రశాంత్ నీల్ కాంభినేషన్ లో వచ్చిన ఉగ్రం సూపర్ హిట్ అయ్యింది.దాంతో బఘీర పై కూడా అంచనాలు పెరిగిపోయాయి.డాక్టర్ సూరి డైరెక్షన్ లో వస్తున్న ఈసినిమాలో రుక్మిణి వసంత్, ప్రకాష్ రాజ్,రంగాయణ రఘు, అచ్యుత్ కుమార్, గరుడ రామ్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.కెజియఫ్ ,సలార్ సినిమాలను నిర్మించిన హోంబలే ఫిలింస్ ఈసినిమాను నిర్మిస్తుండగా బి అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
తెలుగులో ఈసినిమాను టాప్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది.అయితే అదే రోజు లక్కీ భాస్కర్, క అలాగే శివ కార్తికేయన్ అమరన్ సినిమాలు కూడా వస్తున్నాయి.దాంతో బఘీరకు పోటీ తప్పకపోవచ్చు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























