టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని క్రాక్, వీరసింహారెడ్డి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద వరుస సక్సెస్‌లు అందుకున్నాడు. ఈ క్రమంలో ఆయన మరో సర్‌ప్రైజింగ్ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టాడు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ హీరోగా నటిస్తున్నాడు. ఆయన గతేడాది గదర్ 2తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం గుర్తుండేవుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కెరీర్‌లో 100 చిత్రాల దిశగా దూసుకుపోతున్న సన్నీడియోల్ బాలీవుడ్‌లో యాంగ్రీ యాక్షన్ హీరోగా ప్రసిద్ధి చెందాడు. ఇక కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో కోర్ టీమ్ మరియు ప్రత్యేక అతిథులతో సినిమా లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతానికి దీనిని వర్కింగ్ టైటిల్ ఎస్‌డీజీఎం (#SDGM) పేరుతో వ్యవహరిస్తున్నారు.
ఇదిలావుంటే, తాజాగా ఈ సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ శనివారం రివీల్ కానుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ నేడు తెలిపింది. బీటౌన్ స్టార్ యాక్టర్ రణ్‌దీప్ హుడా కీలక పాత్రలో నటిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రణ్‌దీప్ స్టైలిష్ లుక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు మేకర్స్. ఇక ఈ చిత్రంలో సన్నీ సరసన సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ సంగీతం అందిస్తుస్తుండగా.. రిషి పంజాబి సినిమాటోగ్రఫర్‌గా, అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్‌లు మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు మేకర్స్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























