కంగువా ప్రమోషన్స్ షురూ

Kanguva Hindi Promotions on Full Swing

దేవర తరువాత సౌత్ నుండి వస్తున్న పెద్ద సినిమా కంగువా.సూర్య నటించిన ఈసినిమాను శివ తెరకెక్కించాడు.పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో భారీ విఎఫ్ఎక్స్ తో వస్తుంది.బడ్జెట్ కూడా ఎక్కువనే.ఈసినిమాపై సౌత్ లోపాటు నార్త్ లోనూ అంచనాలు వున్నాయి.దిశా పటాని ,బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు.ఇక ఈసినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఈరోజు హిందీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.అందులో భాగంగా ముంబై లో వరుసగా ఇంటర్వ్యూలు జరిగాయి.ఇందులో సూర్య ,దిశా బాబీ డియోల్ ,శివ పాల్గొన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగులో కూడా భారీ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు అలాగే బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్ 4 లో కంగువా టీం సందడి చేయనుందట.అటు తమిళనాడు లో ఈనెల 26న ఆడియో లాంచ్ ఈవెంట్ జరుగనుంది. మొత్తానికి సినిమా రిలీజ్ కు ఇంకా నెలకు పైగా సమయం వున్న అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసి సినిమాను జనాల్లోకి తీసుకెళ్తున్నారు.ఈసినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా యువీక్రియేషన్స్ ,స్టూడియో గ్రీన్ నిర్మిస్తున్నాయి.వచ్చే నెల 14న కంగువా భారీ లెవెల్లో రిలీజ్ కానుంది.

ఇక సూర్య రీసెంట్ గా తన 44వ సినిమా ను ఫినిష్ చేశాడు.కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తుండగా గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ తో వస్తుంది. ఇక కొద్ది రోజుల క్రితం సూర్య తన 45వ సినిమాను కూడా అనౌన్స్ చేశాడు.ఆర్ జె బాలాజీ ఈసినిమాను డైరెక్ట్ చేయనున్నాడు.కంగువా రిలీజ్ తరువాత సూర్య ఈసినిమాను స్టార్ట్ చేయనున్నాడు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.