మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల దసరా బ్లాక్ బస్టర్ ‘విశ్వం’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై నిర్మాత టిజి విశ్వప్రసాద్ హైబడ్జెట్‌తో నిర్మించారు. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పించారు. దసరా కానుకగా అక్టోబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజై అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తూ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్‌తో ఘన విజయాన్ని సాధించి, సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ విశ్వం దసరా బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ నిర్వహించారు. సినిమా యూనిట్ అంతా పాల్గొన్న ఈ సక్సెస్ మీట్ చాలా గ్రాండ్‌గా జరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా డాక్టర్ నరేష్ వికె మాట్లాడుతూ.. “ఈ సినిమా ఫస్ట్ డే షూటింగ్ అప్పటినుంచి కొడతామని వినిపిస్తూనే ఉంది. అందరం అదే అనుకున్నాం. ఇవాళ దసరా ధమాకా హిట్ కొట్టాం. 2024 దసరా హిట్ అనేది ఈ సినిమాతో గుర్తుండిపోతుంది. గోపీచంద్ మాస్ హీరో. యాక్షన్ తో పాటు హ్యూమర్ రొమాన్స్‌ని కూడా అంత అద్భుతంగా పండించగలరు. చాలా ప్రశాంతంగా ఉంటారు. పీపుల్ మీడియాలో ఫస్ట్ టైం పని చేయడం ఆనందంగా ఉంది” అని చెప్పారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “మ్యాంగో శ్యామ్ ఎపిసోడ్ నా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఈ క్యారెక్టర్ వరకు డైరెక్టర్ శ్రీనువైట్ల గారిని నేను ఫాలో అయిపోయాను. మంచి టైమింగ్ ఉన్న డైరెక్టర్ దగ్గర పని చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా చేస్తున్నప్పుడు అందరం నవ్వుతూనే ఉన్నాం. తెలుగు ఇండస్ట్రీ2024 దసరా బిగ్గెస్ట్ హిట్ గా విశ్వం చరిత్రలో నిలిచిపోతుంది. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు” అని తెలిపారు నటుడు నరేష్.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























