మెగాస్టార్ చేతులమీదుగా.. నాగబంధం గ్రాండ్‌ లాంచ్

Megastar Chiranjeevi Clapped For Grand Muhurtham of Pan India Film Naga Bandham

పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు నిర్మించే పాషనేట్ ఫిల్మ్ మేకర్ అభిషేక్ నామా, డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్‌తో దర్శకుడిగా సక్సెస్ ఫుల్ డెబ్యు చేసిన తర్వాత, తన అప్ కమింగ్ డైరెక్షనల్ వెంచర్ ‘నాగబంధం- ది సీక్రెట్ ట్రెజర్’ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు. అభిషేక్ నామా కథతోపాటు స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అభిషేక్ పిక్చర్స్‌తో కలిసి NIK స్టూడియోస్ ప్రొడక్షన్ నంబర్ 1గా కిషోర్ అన్నపురెడ్డి ఈ మ్యాజిస్టిక్ ఎడ్వంచర్ ని నిర్మించనున్నారు. తారక్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి లక్ష్మీ ఐరా, దేవాన్ష్ నామా సమర్పిస్తున్నారు. ‘నాగబంధం’ చిత్రంలో విరాట్ కర్ణ లీడ్ రోల్ పోషిస్తున్నారు.

అంతకుముందు ‘పెదకాపు’ సినిమాతో సక్సెస్ ఫుల్‌గా డెబ్యు చేసిన విరాట్ కర్ణ, తన పవర్ ప్యాక్డ్ యాక్షన్ పెర్ఫార్మెన్స్‌తో అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఇందులో నభా నటేష్, ఐశ్వర్య మీనన్ ఫిమేల్ లీడ్స్ గా నటిస్తున్నారు. జగపతి బాబు, జయప్రకాష్, మురళీ శర్మ, బి.ఎస్. అవినాష్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

భారీ అంచనాలున్న ఈ చిత్రం ఈరోజు టీం, ప్రత్యేక అతిథుల సమక్షంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి ముహూర్తం షాట్‌కి క్లాప్‌ కొట్టారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కెమెరా స్విచాన్ చేయగా, తొలి షాట్‌కి అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. టాలీవుడ్ టాప్ ఎగ్జిబిటర్-ప్రొడ్యూసర్ ఏషియన్ సునీల్ నారంగ్ స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందజేశారు.

అభిషేక్ నామా డివైన్, అడ్వంచర్ ఎలిమెంట్స్ తో కూడిన పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను రాశారు. తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయంలో నిధి, పూరీ జగన్నాథ ఆలయంలో రత్న భండార్‌ను తెరిచిన తర్వాత గుప్త నిధుల అంశం దేశంలో హాట్ టాపిక్‌గా మారింది. భారతదేశంలోని 108 విష్ణు దేవాలయాలు నాగబంధం ద్వారా రక్షించబడుతున్నాయి.

సినిమా కథ భారతదేశంలోని 108 విష్ణు దేవాలయాలకు సంబంధించిన నాగబంధం చుట్టూ తిరుగుతుంది. ఇందుకు సంబంధించి మెస్మరైజ్ చేసే ఇంట్రో వీడియో ప్రేక్షకులను కట్టిపడేసింది. KGFలో తన పాత్రతో పేరు తెచ్చుకున్న అవినాష్ అఘోరాగా కనిపించారు.

ఇక ఈ చిత్రంలో VFX, ప్రొడక్షన్ వాల్యూస్, టెక్నికల్ స్టాండర్డ్స్ అద్భుతంగా వుండబోతున్నాయి. ఈ చిత్రానికి సౌందర్ రాజన్ డీవోపీగా పని చేస్తున్నారు, అభే సంగీతం అందిస్తున్నారు. కళ్యాణ్ చక్రవర్తి డైలాగ్స్ రాయగా, సంతోష్ కామిరెడ్డి ఎడిటర్. అశోక్ కుమార్ ప్రొడక్షన్ డిజైనర్.

ఈ ప్రతిష్టాత్మకమైన హై-బడ్జెట్ ప్రాజెక్ట్ మేజిక్, మిస్టరీ, అడ్వెంచర్ జర్నీని ప్రామిస్ చేస్తోంది. పాన్ ఇండియా మూవీ నాగబంధం 2025లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ఏకకాలంలో విడుదల కానుంది. ఈ నెల 23న రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తామని మేకర్స్‌ అనౌన్స్ చేశారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.