వరసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా వున్న యంగ్ హీరోల్లో సుహాస్ ఒకరు.ఈ ఏడాది ఆల్రెడీ అంబాజీ పేట మ్యారేజి బ్యాండు ,ప్రసన్న వదనం, గొర్రె పురాణం సినిమాలతో వచ్చాడు ఇందులో రెండు సూపర్ హిట్స్ వున్నాయి.ఇక ఇప్పుడు మరో సినిమాతో రానున్నాడు.అదే జనక అయితే గనక.దిల్ రాజు బ్యానర్ నుండి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు వున్నాయి.ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా అనిపించింది.ఈ శనివారం థియేటర్లలోకి రానుంది.అయితే సినిమా మీద వున్న నమ్మకంతో ఒక రోజు ముందే పెయిడ్ ప్రీమియర్స్ వేయనున్నారు.సెలెక్టెడ్ థియేటర్లలో ఈ ప్రీమియర్స్ పడనున్నాయి.రేపు వీటి బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి.ఇక దసరా టార్గెట్ గా మరికొన్ని సినిమాలు బరిలోకి దిగుతున్నాయి దాంతో జనక అయితే గనక కు పోటీ తప్పకపోవచ్చు.
సందీప్ రెడ్డి బండ్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈసినిమాలో సంగీర్తన హీరోయిన్ గా నటించగా రాజేంద్ర ప్రసాద్,వెన్నెల కిషోర్,మురళీ శర్మ, గోపరాజు, రఘుబాబు, పృథ్వీ కీలక పాత్రల్లో నటించారు. బేబీ ఫేమ్ విజయ్ బుల్గానిన్ సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























