భారత దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా అస్తమయం

Indian Business Tycoon Ratan Tata Passed Away

భారతీయ వ్యాపార దిగ్గజం, టాటా సన్స్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటా కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో అస్వస్థతకు గురైన ఆయనను సోమవారం ముంబైలోని బ్రీచ్‌ కాండీ హాస్పిటల్‌లో చేర్పించారు. ఈ క్రమంలో ఐసీయూలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు రతన్‌ టాటా మృతి చెందిన విషయాన్ని టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా తన ఆరోగ్యం బాగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సోమవారం రతన్‌ టాటా సోషల్‌ మీడియా ద్వారా స్వయంగా తెలియజేయడం విశేషం. అయితే ఈ రెండు రోజుల్లోనే ఆయన ఆరోగ్యం క్షీణించి పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. దీంతో దేశం యావత్తూ విషాదంలో మునిగిపోయింది.

సూని టాటా, నావల్ టాటా దంపతులకు 1937 డిసెంబర్ 28న ముంబైలో జన్మించారు రతన్‌ టాటా. 1959లో అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు. 1961లో చిరుద్యోగిగా టాటా గ్రూప్‌లో చేరిన ఆయన అంచెలంచెలుగా చైర్మన్ స్థాయికి అడిగారు. 1991లో టాటా గ్రూప్‌ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి 2012వరకు కొనసాగారు.

ఆయన పగ్గాలు అందుకునే సమయానికి టాటా గ్రూప్‌లో 250 వరకూ ఉన్న అనేక కంపెనీలను 98కి కుదించి వాటి సామర్ధ్యాన్ని పెంచారు. ఈ క్రమంలో టాటా గ్రూప్‌ నికర విలువను 10 వేల కోట్ల డాలర్ల స్థాయికి పెంచి ఇండస్ట్రీ వర్గాల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించారు. దాదాపు 20 ఏళ్లకు పైగా టాటా గ్రూపు సంస్థలను రతన్‌ టాటా విజయవంతంగా నడిపించారు.

నష్టాల్లో పూడుకుపోయిన బ్రిటన్ దిగ్గజ కంపెనీలు ‘జాగ్వార్’ మరియు ‘ల్యాండ్ రోవర్’ లను కొనుగోలు చేసి లాభాల బాట పట్టించిన ఘనుడు రతన్. అలాగే పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన దేశీయ విమానయాన కంపెనీ ‘ఎయిరిండియా’ ను ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసి మళ్ళీ లాభాల్లోకి తేవడం వెనుక రతన్ మాస్టర్ మైండ్ ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఇక టాటా సన్స్‌ చైర్మన్‌ బాధ్యతల నుంచి ఆయన తప్పుకున్నప్పటికీ సేవా సంస్థ అయిన టాటా ట్రస్ట్స్‌కు చైర్మన్‌గా కొనసాగుతుండటం గమనార్హం. కేవలం వ్యాపారమే కాకుండా అంతకుమించి సమాజసేవ చేశారు. తన ఆదాయంలో 65 శాతానికి పైగా విరాళాల రూపంలో వివిధ దాతృత్వ కార్యక్రమాలకు అండగా నిలిచారు. దాతృత్వానికి మారుపేరుగా నిలిచి ఎంతోమందికి స్ఫూర్తి కలిగించారు.

మధ్యతరగతి ప్రజలు సైతం కొనుగోలు చేయగలిగేలా కేవలం 1 లక్షకే ‘నానో’ కారు వారికి అందుబాటులోకి తేవడంలో రతన్ టాటాదే కీలక భూమిక. కాగా వ్యాపార రంగంలో రతన్‌ టాటా సాధించిన విజయాలు మరియు చేసిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం ఆయనకు 2000వ సంవత్సరంలో ‘పద్మభూషణ్‌’, 2008లో ‘పద్మ విభూషణ్‌’ పురస్కారాలతో సత్కరించింది.

వీటితోపాటు మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు, ప్రతిష్టాత్మక అవార్డులు ఆయనను వరించాయి. మహారాష్ట్ర భూషణ్‌, అస్సాం బైభవ్‌, ఆర్డర్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా, హానరరీ నైట్‌ గ్రాండ్‌ క్రాస్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ది బ్రిటిష్‌ ఎంపైర్‌ వంటి పురస్కారాలు ఆయనకు అందించబడ్డాయి. అలాంటి దిగ్గజ పారిశ్రామికవేత్త అస్తమయంతో భారత్ కు తీరని లోటు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.