శ్రీవిష్ణుని కమల్ హాసన్ గారితో పోల్చింది అందుకే

SWAG Producer TG Vishwa Prasad Compares Hero Sree Vishnu with Kamal Haasan

కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీవిష్ణు, ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి లేటెస్ట్ కంటెంట్ ప్యాక్డ్ బ్లాక్ బస్టర్ ‘శ్వాగ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రీతూ వర్మ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్ ఇతర కీలక పాత్రల్లో పోషించారు. అక్టోబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అలాగే విమర్శకులు ప్రశంసలు అందుకొని కంటెంట్ ప్యాక్డ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ నేపధ్యంలో మేకర్స్ గ్రాండ్ గా ఆడియన్స్ విక్టరీ శ్వాగ్ సక్సెస్ మీట్ నిర్వహించారు. మూవీ టీం అంతా పాల్గొన్న ఈ సక్సెస్ మీట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఆడియన్స్ విక్టరీ శ్వాగ్ సక్సెస్ మీట్‌లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ హీరో శ్రీవిష్ణుని లోకనాయకుడు కమల్ హాసన్ గారితో పోల్చడంపై వివరణ ఇచ్చారు.

ఈ సందర్భంగా టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. స్వాగ్ ని ఇంత అద్భుతంగా ఆదరించిన ఆడియన్స్ అందరికీ థాంక్యూ. నేను టీజర్ లాంచ్ ఈవెంట్ లోనే శ్రీ విష్ణు ని కమల్ హాసన్ గారితో పోల్చడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పాను. ఇంద్రుడు చంద్రుడు, మైఖేల్ మదన్ కామరాజు, భామనే సత్యభామనే సినిమాల్లో కమలహాసన్ గారు చేసింది మనం ఒక్క సినిమాలో చూడచ్చని చెప్పాను.” అని తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఈ సినిమా కంటెంట్ విషయంలో చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. హసిత్, శ్రీ విష్ణు చాలా వర్క్ చేశారు. శ్రీ విష్ణుతో అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. అలాగే హసిత్ నెక్స్ట్ ఇయర్ మరో మూవీ చేయబోతున్నాం. సినిమాని చక్కగా ప్రమోట్ చేసిన మీడియాకి థాంక్యూ” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.