టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నారా రోహిత్ చాలాకాలం గ్యాప్ తర్వాత ఇటీవలే ‘ప్రతినిధి 2’ చిత్రంతో ప్రేక్షకులముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన హీరోగా ప్రస్తుతం ‘సుందరకాండ’ అనే ఫామిలీ ఎంటర్‌టైనర్ చేస్తున్నాడు. ఇది రోహిత్ కెరీర్‌లో 20వ సినిమాగా తెరకెక్కుతుండటం విశేషం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్ కూడా మూవీ లవర్స్‌ను ఇంప్రెస్ చేసింది. అలాగే రీసెంట్‌గా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి ఓ క్రేజీ అప్‌డేట్ అందించారు మేకర్స్. సుందరకాండ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. ఈ మేరకు అక్టోబర్ 9న ‘హమ్మయ్య’ అంటూ సాగే ఈ లిరికల్ వీడియో విడుదల కానున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
ఈ సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఇందులో హీరో నారా రోహిత్ ఒక అద్దం ముందు నిలబడి ” ‘సాంగ్ వేస్తే బెటరా? ట్రైలర్ వేస్తే బెటరా? అని తనని తాను ప్రశ్నించుకోవడం కనిపిస్తుంది. చివరకు సాంగ్ వేస్తేనే బెటర్’ అంటూ అక్కడినుంచి పక్కకి వెళ్లిపోయాడు. అయితే దీనినిబట్టి ముందు సెకండ్ సింగిల్ రానుండగా.. ఇక త్వరలోనే ట్రైలర్ కూడా రిలీజ్ చేసే ఉద్దేశంలో చిత్ర యూనిట్ ఉందని అర్ధమవుతోంది.
కాగా ఈ చిత్రాన్ని సందీప్ పిక్చర్స్ ప్యాలెస్ అనే నూతన నిర్మాణ సంస్థ నిర్మిస్తుండగా.. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో చాలావరకు కొత్త వాళ్లే నటిస్తున్నారు. ఇక త్వరలోనే సుందరకాండ థియేటర్లలో విడుదలకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























