వైవిధ్యమైన సినిమాలు, భారీ చిత్రాలను తెరకెక్కించటంలో సెన్సేషనల్ డైరెక్టర్ గుణశేఖర్‌కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఆయన డైరెక్షన్లో ‘యుఫోరియా’ అనే యూత్‌ఫుల్ సోషల్ డ్రామాని గుణ హ్యాండ్‌మేడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మించారు. ఈ సినిమాకి విఘ్నేష్, లిఖిత, పృథ్వీ, శ్రీనిక ప్రధాన తారాగణం కాగా.. భూమిక ముఖ్య పాత్రను పోషించారు. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు, కే ఎల్ దామోదర ప్రసాద్ సోమవారం నాడు రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. “గుణ శేఖర్ గారి మొదటి చిత్రం లాఠీ. అది చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ఆయన ఎన్నో సక్సెస్‌లు చూశారు. ఫెయిల్యూర్స్ కూడా చూశారు. ఫెయిల్యూర్స్ తరువాత వచ్చే సక్సెస్, ఆ సక్సెస్ ఇచ్చే కిక్కు వేరేలా ఉంటుంది. యుఫోరియా గ్లింప్స్ అదిరిపోయింది. నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా ఉంది. నైట్ లైఫ్, డ్రగ్స్ ఇలా ఇప్పటి తరానికి తగ్గట్టుగా ఉంది. ఈ చిత్రంలో అందరూ కొత్త వాళ్లే నటిస్తున్నారు. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను” అని చెప్పారు.
అలాగే మరో ప్రొడ్యూసర్ కే ఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. “గుణ శేఖర్ వెర్సటైల్ దర్శకుడు. యుఫోరియా గ్లింప్స్ బాగుంది. విజువల్స్ బాగున్నాయి. ఆర్ఆర్ బాగుంది. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























