గోపిచంద్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న సినిమా విశ్వం.వచ్చే శుక్రవారం థియేటర్లలోకి రానుంది.శ్రీనువైట్ల మార్క్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ ,సాంగ్స్ ప్రామిసింగ్ గా అనిపించాయి.ఇక కీలకమైన ట్రైలర్ రేపు విడుదలకానుంది.రేపు మధ్యాహ్నం 12:06 గంటలకు విడుదలచేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విశ్వంలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించగా చైతన్య భరధ్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ,చిత్రాలయం స్టూడియోస్ నిర్మిస్తున్నాయి.గోపిచంద్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో వస్తున్న కూడా ఇదే.ఇక ఈసినిమా విజయం అటు శ్రీను వైట్లకు అలాగే గోపిచంద్ కు కీలకం కానుంది.శ్రీను వైట్ల హిట్ చూసి చాలా ఏళ్ళు దాటింది.అప్పుడెప్పుడో దూకుడుతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు.ఆ తరువాత ఒక్క సినిమాను కూడా హిట్ గా మలచలేకపోయాడు.ఇప్పుడు విశ్వంతోనైనా హిట్ కొట్టి మళ్ళీ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వాలని అనుకుంటున్నాడు.
ఇక ఈఏడాది సమ్మర్ లో భీమాతో వచ్చాడు గోపిచంద్. ఈసినిమా గోపిచంద్ ఇంతకుముందు సినిమాల కన్నా పర్వాలేదనిపించింది.కానీ తనకు కావల్సిన హిట్ ను ఇవ్వలేకపోయింది.ఇప్పుడు విశ్వంతో వస్తున్నాడు.ఈసినిమా తనకు సాలిడ్ హిట్ ఇస్తుందని నమ్ముతున్నాడు.మరి వీరిద్దరికి విశ్వం ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.దసరా సెలువులు అలాగే పెద్దగా పోటీ లేకపోవడం విశ్వంకు అడ్వాంటేజ్ కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























