నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం

Actor Rajendra Prasad’s Daughter Gayathri Passed Away

టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఇంట తీవ్ర చోటుచేసుకుంది. ఆయన కుమార్తె గాయత్రి మృతి చెందారు. శుక్రవారం ఆమె ఇంట్లో ఉండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి నేడు గాయత్రి తుదిశ్వాస విడిచారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే గాయత్రి మరణవార్తతో వారి ఫ్యామిలీ షాక్‌లో ఉంది. రాజేంద్ర ప్రసాద్ తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్టు తెలుస్తోంది. కూతురు మృతిచెందడాన్ని తట్టుకోలేక ఆయన కన్నీరు మున్నీరు అవుతున్నారు. గతంలో పలు సందర్భాల్లో కుమార్తె గాయత్రి అంటే తనకెంత ఇష్టమో రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. ఇక గాయత్రి కన్నుమూసిన విషయం తెలియడంతో పలువురు సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్‌ను పరామర్శిస్తున్నారు.

గాయత్రి వృత్తిరీత్యా న్యూట్రిషియన్ కాగా, ఆమె భర్త మహీంద్ర అండ్ మహీంద్ర కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది. ‘మహానటి’ మూవీలో తను చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. అయితే గాయత్రి ప్రస్తుత వయసు కేవలం 38 ఏళ్ళు కావడం గమనార్హం. ఇంత చిన్నవయస్సులోనే మృతి చెందడం బాధాకరం. గాయత్రి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం..

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.