యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ మూవీ భలే ఉన్నాడే ఓటిటిలోకి వచ్చేసింది.ఈటీవీ విన్ నిన్నటి నుండి ఈసినిమాను స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.ఇక గత నెలలో థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా నిరాశపరించింది.శివ సాయి వర్ధన్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో మనీషా కందుకూర్ హీరోయిన్ గా నటించగా వీటీవీ గణేష్ ,గోపరాజు రమణ కీలక పాత్రలు పోషించారు.శేఖర్ చంద్ర సంగీతం అందించాడు.కిరణ్ కుమార్ నిర్మించాడు.ప్రముఖ దర్శకుడు మారుతి ఈసినిమాకు సమర్పకుడిగా వ్యవహరించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నెలన్నర గ్యాప్ లో మూడు సినిమాలతో వచ్చాడు రాజ్ తరుణ్.అందులో భాగంగా జూలై లో పురుషోత్తముడు ఆగస్టు లో తిరగబడరసామీ సెప్టెంబర్ లో భలే ఉన్నాడే తో అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.అయితే ఇందులో ఏ ఒక్క సినిమా కూడా వర్క్ అవుట్ కాలేదు.మొదటి రెండు సినిమాలకన్నా భలే ఉన్నాడే పర్వాలేదనే టాక్ ను సొంతం చేసుకుంది కానీ కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది.దాంతో రాజ్ తరుణ్ ఎదురుచూపులకు బ్రేక్ పడలేదు.
కెరీర్ లో ప్రారంభం లో వరుస విజయాల తో దూసుకుపోయిన ఈ హీరో గత కొన్నేళ్ల నుండి సరైన సక్సెస్ లేక బాగా వెనుకబడిపోయాడు.మరి తన నెక్స్ట్ సినిమా తోనైనా హిట్ కొట్టి ఫామ్ లోకి వస్తాడో చూడాలి.త్వరలోనే రాజ్ తరుణ్ నెక్స్ట్ మూవీ గురించి అప్డేట్ రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























