రివ్యూ: స్వాగ్

Swag Movie Review in Telugu

నటీనటులు: శ్రీవిష్ణు, రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్ తదితరులు
సంగీతం: వివేక్ సాగర్
సినిమాటోగ్ర‌ఫీ: వేదరామన్ శంకరన్
ఎడిటింగ్: విప్లవ్ నైషధం
నిర్మాణం: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
నిర్మాత: టీజీ విశ్వప్రసాద్
దర్శకత్వం: హసిత్ గోలి

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీవిష్ణు, ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం ‘స్వాగ్’. ఇంతకుముందు వీరి కాంబోలో వచ్చిన ‘రాజరాజ చోర’ సినిమా మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో దీనిపై మంచి అంచనాలే ఉన్నాయి. అలాగే ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మూవీపై హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలో స్వాగ్ నేడు థియేటర్లలోకి వచ్చేసింది. మరి స్వాగ్ ప్రేక్షకులను అలరించిందా? హసిత్ గోలి-శ్రీవిష్ణు జోడీ మరోసారి హిట్ కాంబో అనిపించుకుందా? లేదా? అన్నది ఇప్పుడు చూద్దాం..

కథ:

కథానాయకుడైన భవభూతి (శ్రీవిష్ణు) పోలీస్ డిపార్టుమెంటులో ఎస్సైగా పనిచేసి రిటైర్ అవుతాడు. అయితే, రిటైర్మెంట్ తర్వాత అతనికి రావాల్సిన బెనిఫిట్స్ అందకుండా ధనలక్ష్మి అనే ఓ మహిళా అధికారి అడ్డుకుంటుంది. దీంతో తీవ్ర నిరాశకు లోనైన భవభూతి, అనుకోకుండా ఒక రహస్యం తెలుసుకుంటాడు. తాను శ్వాగణిక వంశానికి చెందివాడినని, పూర్వీకులనుంచి వారసత్వంగా తనకు కోట్ల రూపాయల ఆస్తి వచ్చే అవకాశం ఉందని తెలుసుకుంటాడు.

అయితే శ్వాగణిక వంశ వారసులు ఈ సంపదను కైవసం చేసుకోవాలంటే వారు తమ వారసత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో భవభూతి ఆ ఆస్తిని దక్కించుకోవడం కోసం వంశవృక్ష నిలయానికి వెళతాడు. అతనికి అక్కడ అనుభూతి (రీతూ వర్మ) తారసపడింది. భవభూతి వారసత్వం నిరూపించుకోవడానికి అవసరమైన శ్వాగణిక వంశ పారంపర్య రాగి పలక ఒకటి ఆమె దగ్గర ఉంటుంది.

దానిని దక్కించుకోవడానికి భవభూతి ప్రయత్నం చేస్తుంటాడు. ఈ క్రమంలో తనలాగే ఉండే సింగరేణి అలియాస్ సింగ (శ్రీవిష్ణు)ని చూస్తాడు. అయితే ఒకే రూపురేఖలతో ఉన్న భవభూతి, సింగ మధ్య సంబంధం ఏమిటి? వాళ్లిద్దరికి ఆస్తి రాకుండా చేసిన యయాతి (శ్రీ విష్ణు) ఎవరు? అసలు శ్వాగణిక వంశ పారంపర్య పలక అనుభూతి దగ్గరకి ఎలా వచ్చింది?

1551 ఏళ్ల క్రితం మగవాళ్లని బానిసల్లా చూసిన వింజామర వంశ మహారాణి రుక్మిణీ దేవి (రీతూ వర్మ)కి ఈ కథకూ సంబంధం ఏంటి? ఆమె ఆధిపత్యాన్ని ధిక్కరించి పురుషాధిక్యతను పెంచడానికి శ్వాగణిక వంశ మహారాజు భవభూతి (శ్రీ విష్ణు) ఏం చేశాడు? రేవతి (మీరా జాస్మిన్), విభూతి ఎవరు? చివరకు ఆస్తి ఎవరు దక్కించుకున్నారు? అనేది మిగతా కథ.

విశ్లేషణ:

ఇంతకుముందెన్నడూలేని కొత్త పాయింట్ తో వచ్చిన ఈ స్వాగ్ ఎలా ఉందంటే..? ఎక్కువ టైమ్ తీసుకోకుండా త్వరగానే కథలోకి తీకెళ్ళాడు దర్శకుడు. శ్రీ విష్ణు, గెటప్ శ్రీను మధ్య హిలేరియస్ కామెడీ ట్రాక్‌తో మొదలై ఇంటర్వెల్ వరకు సరదాగా సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే సర్‌ప్రైజింగ్‌గా ఉంది. ఇక సెకండాఫ్‌లో శ్రీవిష్ణు తన పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. ఆల్మోస్ట్ వన్ మ్యాన్ షో చేశాడని చెప్పొచ్చు. సెకండాఫ్ లో ఎమోషనల్ టచ్ ఇచ్చాడు దర్శకుడు. ఓవరాల్ గా ఈ స్వాగ్ డీసెంట్ అనిపిస్తుంది.

డైరెక్టర్ హసిత్ గోలి ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్‌ని తనదైన స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశాడు. మొత్తానికి ఈ చిత్రం డీసెంట్‌గా ఉండి ప్రతి ఒక్కరినీ అలరించేలావుంది. న్యూ ఏజ్ సినిమాను బోల్డ్ నెరేటివ్‌తో చెప్పడం అంటే ఆషామాషీ కాదు. ఈ విషయంలో దర్శకుడి టేకింగ్‌ను అభినందించాల్సిందే. అయితే చెప్పాలనుకున్న విషయాన్ని కొంచెం తడబాటు కనిపించినా ఆకట్టుకునేలానే ప్రజెంట్ చేసాడు.

నటీనటుల విషయానికొస్తే, శ్రీవిష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తానేంటో ఇప్పటికే అనేక చిత్రాల్లో ప్రూవ్ చేసుకున్నాడు. సరైన పాత్ర పడితే తనలోని నటుడు విజృంభిస్తాడు. ఇందులో కూడా నాలుగు డిఫరెంట్ రోల్స్ చేశారు. అందులో ‘సింగ’ క్యారెక్టర్ హిలేరియస్‌గా ఉంది. అలాగే మిగతా మూడు క్యారెక్టర్లలోనూ ఆయన పెర్ఫార్మెన్స్ అద్భుతం. ఇందులో శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్‌ ఇచ్చాడు.

ఇక ఈ సినిమాలో శ్రీవిష్ణు క్యారెక్టర్స్ తర్వాత అంత ప్రభావం కలిగిన పాత్రలో రీతూ వర్మ కనిపించింది. మహారాణి రుక్మిణి దేవి పాత్రలో బాగా సూట్ అయింది. సున్నితమైన భావాలను కళ్ళలో పలికించగలిగే అతికొద్దిమంది నటీమణుల్లో తను ఖచ్చితంగా వుంటుంది. సీనియర్ నటి మీరా జాస్మిన్ చాలా ఇంపాక్ట్ ఫుల్ రోల్ చేసింది. చాలారోజుల తర్వాత నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్రలో ఆమె కనిపించింది.

అలాగే టెక్నీషియన్ల విషయానికొస్తే, వివేక్ సాగర్ అందించిన సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటల్లోనే కాకుండా అనేక సన్నివేశాల్లో బీజీఎమ్ ఆకట్టుకునేలావుంది. వేదరామన్ శంకరన్ సినిమాటోగ్ర‌ఫీ చాలా రిచ్ గా ఉంది. విప్లవ్ నైషధం ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. సినిమాలో ఎక్కడా అనవసరమైన సన్నివేశాలున్నాయనే ఫీల్ కలుగకుండా ఉందంటే అందుకు కారణం విప్లవ్ ఎడిటింగే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చుకు ఎక్కడా రాజీపడలేదని అర్ధమవుతుంది.

ఓవరాల్‌గా స్వాగ్ ఆడియెన్స్‌కి డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే చిత్రం అని చెప్పొచ్చు.రెగ్యులర్ కమర్షియల్ సినిమాల ఫార్మాట్‌లో వుంటూనే ఒక కొత్త కాన్సెప్టుతో సాగుతుంది.మొత్తానికి స్వాగ్ కొత్తదనం కోరుకునే ప్రేక్షకులతోపాటు అన్ని వర్గాల వారిని అలరించేలావుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.