మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్‌లో నటించిన ‘దేవర’ మూవీ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది. విడుదలకు ముందే ఏర్పడ్డ భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది దేవర. మొదటిరోజు అనూహ్యంగా మిక్స్‌డ్ టాక్ వచ్చినా ఆ తర్వాత క్రమంగా ఆడియెన్స్ మౌత్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో దేవర చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలి మూడు రోజుల్లోనే 304 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఇక రోజురోజుకీ కలెక్షన్స్ పెంచుకుంటూ బ్లాక్ బస్టర్ దిశగా సాగుతోంది. ఈ క్రమంలో కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీ బెల్ట్ మరియు ఓవర్‌సీస్‌లో సైతం దేవర అదరగొడుతోంది.
అయితే నిన్న గాంధీ జయంతి నేపథ్యంలో నేషనల్ హాలిడే కావడం ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. దాదాపు చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, దేవర చిత్రం మొత్తం 6 రోజుల్లో 396 కోట్లు వసూలు చేసింది. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అఫీషియల్‌గా ప్రకటించారు.
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా.. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించారు. అలాగే ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, అజయ్, గెటప్ శీను తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మించారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























