మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. సీనియర్ నటీనటులతో పాటు 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు పరిచయం చేస్తూ మేకర్స్ చేసిన ఈ ప్రయత్నానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆడియెన్స్, విమర్శకులతో పాటు సినీ సెలబ్రిటీ నుంచి అభినందనలు అందుకుని బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ మూవీ 50 రోజులను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సోమవారం ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా 50 డేస్ సెలబ్రేషన్స్ జరిగాయి. కార్యక్రమంలో భాగంగా ఈ చిత్రంలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ 50 డేస్ మెమొంటోని బహూకరించారు.
ఈ సందర్భంగా చిత్ర సమర్పకురాలు నిహారిక కొణిదెల మాట్లాడుతూ.. “కమిటీ కుర్రోళ్ళు’ సక్సెస్‌లో భాగమైన అందరికీ థాంక్స్. ఈ క్షణాలను ఎప్పటికీ మరచిపోలేం. ఓ మంచి సినిమాను తీస్తున్నామని అనుకున్నాం. కానీ, 50 డేస్ సక్సెస్‌ఫుల్ రన్ ఉంటుందని అనుకోలేదు. మా సినిమాలో భాగమైన నటీనటులు, టెక్నీషియన్స్‌కు థాంక్స్. భవిష్యత్తులో ఈ టీమ్‌తో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ.. “నాన్న నాకు బిగ్గెస్ట్ పిల్లర్‌గా నిలిచారు. ఆయన అందించిన సపోర్ట్‌కు థాంక్స్. ఆయన కథ విని బావుందనగానే నాకు నమ్మకం వచ్చింది. దిల్ రాజు గారు నాకు ఇన్‌స్పిరేషన్. ఆయనలా డిఫరెంట్ మూవీస్, కమర్షియల్ మూవీస్ చేయాలనుకుంటున్నాను. ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రాన్ని పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు మరోసారి ధన్యవాదాలు” అని చెప్పారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































