స్వాగ్ ట్రైలర్ వచ్చేసింది.. శ్రీవిష్ణు, రీతూ వర్మ కెమిస్ట్రీ అదుర్స్

Sree Vishnu and Ritu Varma's Swag Trailer Released

కింగ్ అఫ్ కంటెంట్ శ్రీవిష్ణు వైవిధ్యమైన పాత్రలతో అదరగొడుతున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఆకట్టుకునే సబ్జెక్ట్‌లను బ్యాలెన్స్ చేయడంలో పేరుపొందిన శ్రీ విష్ణు సూపర్ హిట్ ‘రాజ రాజ చోరా’ తర్వాత డైరెక్టర్ హసిత్ గోలీతో తన సెకెండ్ కొలాబరేషన్‌గా ‘స్వాగ్’తో అలరించబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఇప్పటికే స్వాగ్ పాజిటివ్ రిపోర్ట్స్‌తో దూసుకుపోతోంది. పోస్టర్లు, ఫస్ట్ సాంగ్ , రేజర్ వీడియో, టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. యూనిక్ కంటెంట్ ప్రేక్షకులని ఎట్రాక్ట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా స్వాగ్ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఇక ఈ ట్రైలర్ చూస్తే, శ్రీవిష్ణు, రీతూ వర్మ కెమిస్ట్రీ అదుర్స్ అనిపించేలావుంది.

డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో శ్రీవిష్ణు పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. అలాగే రీతూ వర్మకి చాలా రోజుల తర్వాత మంచి క్యారక్టర్ దొరికినట్టు అర్ధమవుతోంది. ఇక ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోప రాజు రమణ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

కాగా స్వాగ్ చిత్రానికి వేదరామన్ శంకరన్ సినిమాటోగ్రాఫర్ కాగా, వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. జిఎం శేఖర్ ఆర్ట్ డైరెక్టర్‌గా, నందు మాస్టర్ స్టంట్స్‌ నిర్వహిస్తున్నారు. దసరాకి దాదాపు 10 రోజుల ముందుగా అక్టోబర్ 4న ‘స్వాగ్’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. పండుగ సెలవులు సినిమాకు ఫేవర్‌గా ఉండబోతున్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.