బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ‘ఆర్ఆర్ఆర్’ ఫేమ్ అలియా భట్ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘జిగ్రా’. ‘రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అలియా నటించిన చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘మోనికా’, ‘ఓ మై గర్ల్ ఫ్రెండ్’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ వాసన్ బాలా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. పీరియాడికల్ క్రైమ్ డ్రామా ‘బాంబే వెల్వెట్’ మరియు సైకలాజికల్ థ్రిల్లర్ ‘రామన్ రాఘవ్ 2.0’కి స్క్రిప్ట్ అందించిన అనుభవం అతడి సొంతం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా తన తమ్ముడి కోసం ఒక అక్క పడే ఆవేదన, పోరాటం ఇతివృత్తంలో జిగ్రా రూపొందుతోంది. ఇక ఇటీవలే ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. యాక్షన్ సీన్స్‌లో అలియా భట్ అద్భుతంగా నటించినట్టు అర్ధమవుతోంది. వర్ధమాన నటుడు వేదాంగ్ రైనా కీలక పాత్రలో నటించాడు. దసరా కానుకగా ఈ మూవీ అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో తాజాగా జిగ్రా సినిమాకు సంబందించి ఓ కీలక అప్డేట్ అందింది. హీరోయిన్ అలియా తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్నందున ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయడానికి మేకర్స్ నిర్ణయించారు. ఈ క్రమంలో జిగ్రా తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ చేజిక్కించుకుంది. ఈ మేరకు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
కాగా జిగ్రా సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్, అపూర్వ మెహతా, అలియా భట్, షాహీన్ భట్, సోమెన్ మిశ్రా సంయుక్తంగా నిర్మించారు. ‘గంగూబాయి కతియావాడి’ వంటి లేడీ ఓరియెంటెడ్ మూవీలో తాను ప్రదర్శించిన నటనకు గానూ అలియా జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రంలో నటిస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: