గేమ్ ఛేంజర్ సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్

Raa Macha Macha song promo OUT NOW

మెగా పవర్ స్టార్‌ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, సునీల్‌, అంజలి, నవీన్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చరణ్ 15వ చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో గ్లోబల్ స్టార్ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు. అయితే గేమ్ ఛేంజర్‌లో తన పాత్రకు సంబంధించి రామ్ చరణ్ షూటింగ్ కంప్లీట్ చేశాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ సింగిల్ ‘జరగండి’ సహా టోటల్ ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ రెస్పాన్స్ అందుకుంది. సోషల్ మెసేజ్‍తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎస్.థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో తాజాగా గేమ్ ఛేంజర్ సెకండ్ సింగిల్‌పై చిత్ర యూనిట్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచింది. ‘రా మచ్చా మచ్చా’ అంటూ సాగే ఈ పాట ప్రోమోను విడుదల చేసింది చిత్ర బృందం.ఫుల్ సాంగ్ ఈనెల 30న రానుంది. ఇక ఈప్రోమో చూస్తుంటే సాంగ్  అదిరిపోయెలానే వుంది.

పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యానర్‌పై టాలీవుడ్ అగ్ర నిర్మాతలు దిల్ రాజు, శిరీష్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. గేమ్ ఛేంజర్ ఎంటైర్ ఓవర్సీస్‌ రిలీజ్ రైట్స్‌ను ‘ఫార్స్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్’ సొంతం చేసుకుంది. డిసెంబర్ 20వ తేదీన క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.