టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటించనున్న విషయం తెలిసిందే. వర్కింగ్ టైటిల్ SSMB29గా వ్యవహరిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. పాన్-వరల్డ్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో ఆయన సరికొత్తగా కనిపించనున్నారని సమాచారం. దీనికోసం మహేష్ బాబు స్పెషల్ మేకోవర్ అయ్యారని తెలుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా ఆయన కొత్త లుక్‌లో కనిపించి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మహేష్ బాబు సోమవారం సతీమణి నమ్రతా శిరోద్కర్‌తో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. తెలంగాణ వరద సహాయక చర్యల నిమిత్తం తమవంతు సాయంగా రూ.50 లక్షలు డొనేషన్ చెక్ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అందించారు.
ఈ సందర్భంగా మహేష్ బాబు డిఫరెంట్ లుక్‌తో కనిపించారు. బాగా పెరిగిన జుట్టుతో పాటు గుబురు గడ్డంతో కనిపించి ఆశ్చర్యపరిచారు. కాగా SSMB29 షూట్‌కు ముందు మహేష్ ఇలా సరికొత్త అవతారంలో కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ప్రస్తుతం ఈ నయా లుక్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. అయితే మహేష్ ఇంతకుముందెన్నడూ ఇలాంటి లుక్‌లో కనిపించలేదు. దీంతో ఆయన న్యూ లుక్ సూపర్ స్టార్ ఫ్యాన్స్‌నే కాకుండా మూవీ లవర్స్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























