మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న 75 సినిమా షూటింగ్ 40శాతం పూర్తయింది.రీసెంట్ గా షూటింగ్ లో గాయపడ్డ రవితేజ తన కుడి చేతికి శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే.దాంతో ప్రస్తుతం రవితేజ విశ్రాంతి తీసుకుంటున్నాడు.ఇక అక్టోబర్ మొదటి వారంలో నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది.ఇందులో రవితేజ పాల్గొనున్నాడు.హైదరాబాద్ లో దాదాపు మూడు వారాల పాటు ఈ షెడ్యూల్ జరుగనుంది.ఆతరువాత కేరళలో లేదా అరకు లో నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.దాంతో షూటింగ్ దాదాపుగా పూర్తి కానుంది.అయితే సంక్రాంతికి వస్తున్నాం అని ఇంతకుముందే ప్రకటించారు కానీ మధ్యలో బ్రేక్ వల్ల ఆ స్లాట్ మిస్ అవ్వనుంది. ఫిబ్రవరి లో రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో రవితేజ రైల్వే పోలీస్ ఫోర్స్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.పవర్ ఫుల్ సబ్జెక్టు తో ఖాకి సినిమా తరహాలో తెరకెక్కుతుంది ఈసినిమా.సామజవరగమన ఫేమ్ భాను భోగవరపు ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది.భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.నాగవంశీ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
ఇదిలావుంటే రీసెంట్ గా మిస్టర్ బచ్చన్ తో వచ్చాడు రవితేజ.ఈఏడాది తనకు ఇది రెండో సినిమా.కానీ మిస్టర్ బచ్చన్ దారుణంగా నిరాశపరిచింది.దాంతో RT 75 విజయం తప్పనిసరి కానుంది.ఈసినిమాపై రవితేజ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.మరి రవితేజ కెరీర్ లో ల్యాండ్ మార్క్ మూవీ గా వస్తున్న ఈసినిమా తనకు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























