మత్తు వదలరా 2.. యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద సంచలనం

Mathu Vadalara 2 Hits The Magical Million Dollar Milestone at USA Box Office

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో, ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఎమ్‌.ఎమ్ కీర‌వాణి త‌న‌యుడు శ్రీ సింహ కోడూరి, సత్య లీడ్ రోల్స్‌లో నటించిన లేటెస్ట్ మూవీ ‘మత్తు వదలరా 2’. రితేష్ రానా దర్శకత్వం వహించాడు. గతంలో వీరి కాంబోలో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘మత్తు వదలరా’కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాపై విడుదలకు ముందే మంచి అంచనాలే నెలకొన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీనికితోడు ఈ మూవీ నుంచి రిలీజైన ఫస్ట్‌లుక్‌, టీజర్‌, ప్రమోషనల్‌ సాంగ్‌.. ఇలా ప్రతి ప్రమోషన్‌ మెటీరియల్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో మత్తు వదలరా 2 శుక్రవారం ప్రేక్షకులముందుకు వచ్చింది. ముందురోజు స్పెషల్ ప్రీమియర్స్ తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ అంచనాలకు మించి హిట్ అయింది.

హీరో శ్రీ సింహా సైడ్ కిక్‌గా సత్య పండించిన కామెడీ బాగా ప్లస్ అయింది సినిమాకు. హీరోతో సమానంగా స్క్రీన్ స్పేస్ దక్కించుకున్న సత్య ఆడియెన్స్‌ను నవ్వుల్లో ముంచెత్తాడని అంటున్నారు. మూవీ ఆద్యంతం హిలేరియస్‌గా ఉందని మౌత్ టాక్ స్ప్రెడ్ అవడంతో అన్ని షోస్ హౌస్ ఫుల్ అయ్యాయి. దీంతో తొలిరోజే మత్తు వదలరా 2 రూ.5.3 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.

ఇదేక్రమంలో ఓవర్‌సీస్‌లో సైతం సత్తా చాటుతోన్న ఈ మూవీ యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృస్తిస్తోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం, మత్తు వదలరా 2 అక్కడ మ్యాజికల్ మిలియన్ డాలర్ మైలురాయిని దాటింది. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ చేసుకున్న ఈ చిత్రం నిర్మాతలతోపాటు డిస్ట్రిబ్యూటర్లకూ మంచి లాభాలను అందిస్తోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.