గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ షురూ చేయనున్నారు

Game Changer Full fledged promotions will start in a week

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ సందడి మొదలు కానుంది.వచ్చే వారం నుండి స్టార్ట్ చేయనున్నారు.అందులో భాగంగా వరుస అప్డేట్స్ ఇవ్వనుంది టీం.ముందుగా ఈనెల చివర్లో సెకండ్ సింగిల్ రిలీజ్ చేయనున్నారు.ఇక అక్కడి నుండి వరుసగా అప్డేట్స్ ఇవ్వనున్నారు.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.అప్పుడెప్పుడో ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు ఇక ఆతరువాత మేజర్ అప్డేట్ ఏం రాలేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నవంబర్ లో ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి క్రిస్మస్ కు బరిలో దించనున్నారు.శంకర్ డైరెక్షన్ లో సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్న ఈసినిమాలో కియరా అద్వానీ హీరోయిన్ నటించగా ఎస్ జె సూర్య,శ్రీకాంత్, శ్యామ్,అంజలి కీలక పాత్రల్లో పోషిస్తున్నారు తమన్ సంగీతం అందిస్తన్నాడు.భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

ఇక రామ్ చరణ్ ప్రస్తుతం తన 16వ సినిమా కోసం లుక్ మార్చే పనిలో వున్నాడు.ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన ఈసినిమాను డైరెక్ట్ చేయనుండగా జాన్వీ కపూర్ హీరోయిన్ నటించనుంది.కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్లనుంది.ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.ఈసినిమా తరువాత చరణ్,సుకుమార్ తో సినిమా చేయనున్నాడు.వీరిద్దరి కాంబినేషన్ లో ఇది రెండో సినిమా.ఇంతకుముందు ఈకాంబోలో వచ్చిన రంగస్థలం బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.