పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ఇటీవలే ఆయన నటించిన ‘కల్కి 2898 AD’ చిత్రం రూ.1200 కోట్లకు పైగా కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది. దీనికి ముందు ‘సలార్: పార్ట్ 1 – సీజ్ ఫైర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇక ఈ రెండు చిత్రాలకు దర్శకులు సీక్వెల్స్ కూడా రెడీ చేస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో కథానాయకుడిగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలావుంటే, తాజాగా ప్రభాస్ నటించిన ఒకప్పటి కల్ట్ క్లాసిక్ సినిమా ఒకటి రీ రిలీజ్‌కి రెడీ రెడీ అవుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించిన కుటుంబ కథాచిత్రం ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’. దశరథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ 2011 ఏప్రిల్ 21న విడుదలై ఘనవిజయాన్ని సాధించింది. జీవితంలో ఎదగాలంటే రాజీపడకూడదు అని బతికే ఒక యువకుడు తనవాళ్ళకోసం తన సిద్ధాంతాలను మార్చుకునే క్రమమే కథాంశంగా రూపొందింది.
ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన కాజల్ అగర్వాల్, తాప్సీ కథానాయికలుగా నటించగా.. రావు రమేష్ ప్రకాష్ రాజ్, నాజర్, మాగంటి మురళీమోహన్, కె.విశ్వనాథ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలోని అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. 2011 సంవత్సరానికిగానూ ఉత్తమ కుటుంబ కథాచిత్రంగా బీ. నాగిరెడ్డి మెమోరియల్ అవార్డును అందుకున్న తొలి సినిమాగా రికార్డ్ సృష్టించింది.
అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా.. ముందురోజు మిస్టర్ పర్‌ఫెక్ట్ మూవీ మళ్లీ థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రాన్ని నిర్మించిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థే దీనిని మళ్ళీ విడుదల చేస్తుండటం విశేషం. ఈసారి సరికొత్త హంగులతో లేటెస్ట్ టెక్నాలజీతో 4Kలో రిలీజ్ అవుతోంది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరో సినిమాను మళ్ళీ బిగ్ స్క్రీన్ పై వీక్షించేందుకు ఉత్సాహంగా ఉన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: